కమల్ హాసన్ (Kamal Haasan) పుట్టిన రోజు సందర్భంగా 'ఇండియన్ 2' (Indian 2) నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్..!

Updated on Nov 07, 2022 04:07 PM IST
ప్రస్తుతం రిలీజ్ అయిన 'ఇండియన్ 2' (Indian 2 Poster) పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం రిలీజ్ అయిన 'ఇండియన్ 2' (Indian 2 Poster) పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

విశ్వనటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న సినిమా 'ఇండియన్ 2' (Indian 2). భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై ఏ.సుభాస్కరణ్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది. 

సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahaman) స్వర కల్పనలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, నేడు ఈ చిత్ర హీరో కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కమల్ లుక్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ క్యూరియాసిటిని పెంచేసింది. ఈ పోస్టర్ లో సేనాపతి పాత్రలో కనిపిస్తున్నారు కమల్. అందులో ఫుల్ అగ్రెసివ్ గా కనిపించారు. ప్రస్తుతం రిలీజ్ అయిన 'ఇండియన్ 2' (Indian 2 Poster) పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. 

1996లో రిలీజైన 'భారతీయుడు' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమా వచ్చి 21ఏళ్ళు అవుతున్నా ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ తగ్గలేదు. ఇక దానికి సీక్వెల్‌ తెరకెక్కుతుందంటే ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అనివార్య కారణాలతో రెండేళ్ల క్రితమే నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల తిరిగి ప్రారంభమయ్యింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!