‘రోలెక్స్’ పాత్రలో నటించాలంటే భయమేసింది.. సూర్య (Suriya Sivakumar) కామెంట్స్ వైరల్

Updated on Oct 13, 2022 12:26 PM IST
‘రోలెక్స్’ రోల్‌లో నటిస్తే ప్రేక్షకులు ఏమనుకుంటారోననే సందేహం కలిగిందని సూర్య (Suriya Sivakumar) అన్నారు 
‘రోలెక్స్’ రోల్‌లో నటిస్తే ప్రేక్షకులు ఏమనుకుంటారోననే సందేహం కలిగిందని సూర్య (Suriya Sivakumar) అన్నారు 

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘విక్రమ్’ (Vikram) సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు. సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న కమల్‌కు.. ‘విక్రమ్’ భారీ ఊరటను కలిగించింది. కమల్‌తో పాటు ఈ సినిమాలో ‘రోలెక్స్’గా కనిపించి థియేటర్లను షేక్ చేశారు హీరో సూర్య. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయిన సూర్య.. తన కెరీర్‌లో గుర్తుండిపోయేలా నటించారనే చెప్పాలి. తాజాగా ‘రోలెక్స్’ (Rolex) క్యారెక్టర్‌ను పోషించడం గురించి సూర్య స్పందించారు. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో సూర్య (Suriya Sivakumar) దీని గురించి మాట్లాడారు. 

‘కమల్ కోసమే ఒప్పుకున్నా’

కేవలం కమల్ హాసన్ కోసమే ‘విక్రమ్’ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని సూర్య అన్నారు. ‘కమల్‌ హాసన్ నాకు స్ఫూర్తి. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి ఆయన ఓ కారణం. ‘విక్రమ్‌’ సినిమాలో ఆఫర్‌ ఉందని దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ ఫోన్‌ చేశారు. దీంతో ఆ అవకాశాన్ని వదులుకోకూడదని ఫిక్సయ్యా. నా సంతోషాన్ని అందరితోనూ పంచుకోవాలనుకున్నా. అయితే ‘రోలెక్స్‌’ పాత్ర గురించి విన్నాక.. అలాంటి రోల్‌లో నటిస్తే ఏమనుకుంటారోననే సందేహం కలిగింది. భయం వేసింది. వెంటనే చేయనని చెప్పేశా. కానీ, చివరకు కమల్ గారి కోసమే ఈ పాత్ర పోషించా’ అని సూర్య చెప్పుకొచ్చారు. అనంతరం ‘రోలెక్స్‌ రోల్‌లో మళ్లీ కనిపిస్తారా?’ అని అడగ్గా.. ‘కాలమే దీనికి సమాధానం చెబుతుంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా’ అని సూర్య జవాబిచ్చారు.

ఇకపోతే, ‘విక్రమ్’ మూవీలో కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి నటుడు ప్రధాన పాత్రల్లో నటించినా.. సినిమా క్లైమాక్స్‌లో సూర్య తన నటనతో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్క్రీన్ పై కనిపించినా.. ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ‘రోలెక్స్’ పాత్రతో సూర్య క్రేజ్ రెట్టింపయ్యింది. 

కాగా,, తమిళంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘విక్రమ్’ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల పరంగా చూసుకుంటే.. తమిళ సినీ పరిశ్రమలో టాప్–3 చిత్రాల్లో ఒకటిగా నిలిచి, రికార్డు సృష్టించింది. ఇక ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్​ ఒకవేళ ‘ఖైదీ 2’ను తీస్తే.. అందులో తమ్ముడు కార్తీకి ప్రతినాయకుడిగా సూర్య కనిపిస్తారు. ఈ సినిమా తెరకెక్కితే ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. 

Read more: సూర్య (Suriya) 42వ సినిమా కోసం మేకర్స్ అంత ఖర్చు పెడుతున్నారా? బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!