Telugu Movies: బాలీవుడ్‌లో తెలుగోడి స‌త్తా .. హిందీలో అత్య‌ధిక వ‌సూళ్లును సాధించిన‌ టాప్ 10 తెలుగు సినిమాలు !

Updated on Jun 28, 2022 08:22 PM IST
Telugu Movies: హిందీలో అత్య‌ధిక వ‌సూళ్లను సాధించిన సినిమాగా బాహుబ‌లి 2  మొద‌టి స్థానంలో నిలిచింది.
Telugu Movies: హిందీలో అత్య‌ధిక వ‌సూళ్లను సాధించిన సినిమాగా బాహుబ‌లి 2 మొద‌టి స్థానంలో నిలిచింది.

Telugu Movies: బాలీవుడ్‌లో టాలీవుడ్ సినిమాలు మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతున్నాయి. హిందీలో డ‌బ్ అయిన తెలుగు సినిమాలు కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతున్నాయి. బాహుబ‌లి 2 సినిమా హిందీ బాక్సాఫీస్‌ను బ‌ద్ద‌లు కొట్టింది. బాహుబ‌లి 2 సినిమా రికార్డును హిందీ సినిమాలతో పాటు మ‌రే సినిమా కూడా అధిగమించలేకపోయింది. బాహుబ‌లి 2 హిందీలో రూ. 510 కోట్ల‌ను రాబ‌ట్టి మొద‌టి స్థానంలో నిలిచింది.

బాలీవుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్లను సాధించిన టాప్ 10 సినిమాల విశేషాలను తెలుసుకుందాం. 

Baahubali: The Beginning: బాహుబ‌లి సినిమా హిందీలో రూ. 118.70 కోట్ల‌ను రాబ‌ట్టింది. 

బాహుబ‌లి (Baahubali: The Beginning)
 అమరేంద్ర బాహుబ‌లి, మహేంద్ర బాహుబలి అనే ఇద్దరు తండ్రి, కొడుకుల క‌థతో బాహుబ‌లి సినిమాను తెరకెక్కించారు. బాహుబ‌లిలో హీరోగా ప్ర‌భాస్ న‌టించారు. ఈ సినిమా 2015 జూలై 10న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైంది. ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మించారు. రాజ‌మౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ బాహుబ‌లి క‌థ‌ను వ్రాశారు. రెండు భాగాలుగా ఈ క‌థ‌ను అందించారు. ఎం.ఎం. కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చారు. 

బాహుబ‌లిలో ర‌మ్య‌కృష్ణ‌, అనుష్క‌, త‌మ‌న్నా, రానా ద‌గ్గుబాటి, నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బాహుబ‌లిని తెర‌కెక్కించారు. హిందీ, మ‌లయాళ భాష‌ల్లో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. 

బాహుబ‌లి సినిమాను రూ. 125 కోట్ల‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించారు. వ‌సూళ్ల ప‌రంగా ఈ సినిమా రూ. 650 కోట్లతో చ‌రిత్ర సృష్టించింది. హిందీలో కూడా అత్య‌ధిక క‌లెక్ష‌న్ రాబ‌ట్టింది. బాహుబ‌లి సినిమా హిందీలో రూ. 118.70 కోట్ల‌ను రాబ‌ట్టింది. 

Bahubali The Conclusion: బాహుబ‌లి సీక్వెల్‌గా బాహుబ‌లి2ను రిలీజ్ చేశారు రాజ‌మౌళి.

బాహుబ‌లి 2  (Bahubali The Conclusion) 
బాహుబ‌లి 2 చిత్రంతో భార‌తీయ సినిమా రికార్డుల‌ను రాజ‌మౌళి తిర‌గ‌రాశారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ పాన్ ఇండియా హీరోగా, రాజ‌మౌళి ద‌ర్శ‌క ధీరుడిగా పేరు తెచ్చుకున్నారు. బాహుబ‌లి సీక్వెల్‌గా బాహుబ‌లి 2 ను రిలీజ్ చేశారు రాజ‌మౌళి. బాహుబ‌లి 2 చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న విడుద‌ల చేశారు.

మొద‌టి భాగం క‌న్నా రెండో భాగం క‌థ‌ను విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అద్భుతంగా రాశారు. ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బాహుబ‌లి 2ని తెర‌కెక్కించారు. హిందీ, మ‌లయాళ, జ‌ప‌నీస్, ర‌ష్య‌న్, చైనీస్ భాష‌ల్లో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. 

బాహుబ‌లి త‌ర్వాత బాహుబ‌లి 2 ను అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. బాహుబ‌లి 2 క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం రూ. 1,810 కోట్ల బిజినెస్ చేసింది. ఇక హిందీ భాష‌ల్లో మొత్తం వ‌సూళ్ల‌లో స‌గం బిజినెస్ చేసింది. బహుబ‌లి 2 హిందీ వ‌ర్ష‌న్ రూ. 510 కోట్ల‌ను రాబ‌ట్టింది. 

Saaho: సాహో సినిమా వ‌సూళ్ల ప‌రంగా దాదాపు రూ.433 కోట్లను బాక్సాఫీసు వద్ద కొల్లగొట్టింది.

సాహో (Saaho)
పాన్ ఇండియా హీరోగా ప్ర‌భాస్ న‌టించిన చిత్రం సాహో.  దర్శకుడు సుజీత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడిగా శ్రద్ధాకపూర్ న‌టించారు. యువీ క్రియేషన్స్, టీ-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సాహో చిత్రం 2019 ఆగ‌స్టు 30న‌ రిలీజ్ అయింది.  ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా దాదాపు రూ.433 కోట్లను బాక్సాఫీసు వద్ద కొల్లగొట్టింది. హిందీలో ఈ సినిమా రూ. 142. 95 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. 

Pushpa: The Rise: హీరో అల్లు అర్జున్ న‌టించిన పుష్ఫ హిందీలో మంచి క‌లెక్ష‌న్ రాబ‌ట్టింది.

పుష్ప (Pushpa: The Rise)  
అల్లు అర్జున్ న‌టించిన పుష్ఫ సౌత్‌తో పాటు నార్త్ లోనూ బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించారు. రష్మికా మందన హీరోయిన్‌గా న‌టించారు. సునీల్‌ శెట్టి, ఫహాద్‌ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అన‌సూయ‌ ప్రధాన పాత్రల్లో న‌టించి వినోదం పంచారు. పుష్ప 2021 డిసెంబ‌ర్ 17 న రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.       

హీరో అల్లు అర్జున్ న‌టించిన పుష్ఫ హిందీలోమంచి క‌లెక్ష‌న్ రాబ‌ట్టింది. ఈ సినిమాను రూ. 200 కోట్ల‌తో తెర‌కెక్కించారు. తెలుగులో తెర‌కెక్కించిన  పుష్ప సినిమాను తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డ‌బ్ చేశారు. క‌లెక్ష‌న్ల ప‌రంగా దాదాపు రూ. 370 కోట్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. హిందీలో వంద కోట్ల‌కు పైగా ఈ సినిమా బిజినెస్ సాధించింది. బాలీవుడ్‌లో రూ. 108.26 కోట్లు వ‌సూళ్లు చేసింది. 
 

RRR : ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రూ. 550 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు.

ఆర్.ఆర్.ఆర్.(రౌద్రం రణం రుధిరం) - (RRR)
స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల పోరాటంపై ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్. తెర‌కెక్కించారు. అల్లూరి సీతారామ‌రాజును పోలిన విప్లవ యోధుడి పాత్రలో రామ్ చ‌ర‌ణ్, కొమురం భీమ్‌ని పోలిన సాయుధవీరుడి పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో న‌టించారు.

అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 2022 మార్చి 25న ఆర్.ఆర్.ఆర్. రిలీజ్ చేశారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మించారు. రాజ‌మౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ క‌థ‌ను అందించారు. 

ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రూ. 550 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. బాహుబ‌లి 2 త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రాజ‌మౌళి ఇండియ‌న్ సినిమా రికార్డులను మ‌రోసారి తిర‌గ‌రాశారు. ఈ సినిమా దాదాపు రూ. 1200 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. హిందీలో ఆర్.ఆర్.ఆర్‌. రూ. 274.31 కోట్ల‌ను రాబ‌ట్టింది. 

Radhe Shyam: రాధేశ్యామ్‌ హిందీ వ‌ర్ష‌న్‌లో దాదాపు రూ. 20 కోట్లు వ‌ర‌కు బిజినెస్ చేసింది. 

రాధేశ్యామ్(Radhe Shyam)
ల‌వ్ స్టోరీగా రాధేశ్యామ్‌ను ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ప్ర‌భాస్‌, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా న‌టించారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.  యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్ నిర్మాణ సంస్థ‌లు రాధేశ్యామ్‌ను నిర్మించాయి. రాధేశ్యామ్ 2022 మార్చి 11న రిలీజ్ అయింది. 

రాధేశ్యామ్ సినిమాను రూ. 300 కోట్ల‌తో తెర‌కెక్కించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 210 కోట్లు వ‌సూళ్లు చేసింది. హిందీ వ‌ర్ష‌న్‌లో దాదాపు రూ. 20 కోట్లు వ‌ర‌కు బిజినెస్ చేసింది. 

Major: మేజ‌ర్  సినిమాను రూ. 30 కోట్ల‌తో నిర్మించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం రూ.66 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది.

మేజ‌ర్ (Major)
మేజ‌ర్ చిత్రాన్ని మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కించారు. అడ‌వి శేష్ మేజ‌ర్ పాత్ర‌లో న‌టించారు. హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ కూడా మేజ‌ర్ భార్య‌గా న‌టించి మెప్పించారు. ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క అద్భుతంగా మేజ‌ర్‌ను తెర‌కెక్కించారు. ఈ సినిమాను మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలు నిర్మించారు. ఈ సినిమాను రూ. 30 కోట్ల‌తో నిర్మించారు. ఇప్ప‌టివ‌ర‌కు రూ.66 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. హిందీలో రూ. 12.30 కోట్లు వ‌సూళ్లు చేసింది. 

Sye Raa Narasimha Reddy: చిరంజీవి సినిమా సైరా హిందీలో ఎనిమిది కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసింది. 

సైరా (Sye Raa Narasimha Reddy)
సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా 2018 ఆగస్టు 20 న విడుదల అయ్యింది. చిరంజీవి సొంత బ్యాన‌ర్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ సంస్థ సైరా చిత్రాన్ని నిర్మించింది.

రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వహ‌రించారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్​ సేతుపతి, నయన తార, అనుష్క శెట్టి, తమన్నాలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. 

సైరా సినిమాను రూ. 270 కోట్ల‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా రూ. 223.89 కోట్లు సాధించింది. చిరంజీవి సినిమా సైరా హిందీలో ఎనిమిది కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసింది. 

Khiladi: హిందీలో ఖిలాడి సినిమా నాలుగు కోట్ల రూపాయ‌ల‌ బిజినెస్ చేసింది. 

ఖిలాడి (Khiladi)
మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో ఖిలాడి సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు.  ఖిలాడి సినిమాను రూ. 60 కోట్ల‌తో నిర్మించారు. హిందీలో ఖిలాడి సినిమా నాలుగు కోట్ల రూపాయ‌ల‌ బిజినెస్ చేసింది. 

Rudhramadevi: రుద్ర‌మ‌దేవి సినిమాను రూ. 60 కోట్ల‌తో తెర‌కెక్కించారు.

రుద్ర‌మ దేవి (Rudhramadevi)
దర్శకుడు గుణశేఖర్ రాణి రుద్రమదేవి చరిత్ర ఆధారంగా అనుష్కతో సినిమా రూపొందించారు. రుద్ర‌మ‌దేవిలో అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో న‌టించారు. రానా, అల్లు అర్జున్ ఈ సినిమాలో న‌టించారు. రుద్ర‌మ‌దేవి సినిమాను రూ. 60 కోట్ల‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమా హిందీలో రూ. 2.26 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. 

Read More: RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!