కొత్త సినిమాను స్టార్ట్ చేసిన యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya).. దర్శకుడు ఎవరంటే..?

Updated on Nov 04, 2022 04:15 PM IST
కొత్త చిత్రం కోసం నాగశౌర్య (Naga Shaurya) పూర్తిగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారని సమాచారం
కొత్త చిత్రం కోసం నాగశౌర్య (Naga Shaurya) పూర్తిగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారని సమాచారం

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya)కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘కళ్యాణ వైభోగమే’, ‘జ్యో అచ్యుతానంద’, ‘ఛలో’ లాంటి సినిమాలో యువతలో పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఆయనకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ మధ్య నాగశౌర్యకు సరైన హిట్స్ రాలేదు. ఆయన గత సినిమాలు ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’, ‘కృష్ణ వ్రింద విహారి’ పెద్దగా ఆడలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని నాగశౌర్య కసిమీద ఉన్నారు. 

తాజాగా మరో కొత్త మూవీని ప్రకటించారు నాగశౌర్య. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వం వహించబోతున్నారు. ఆయనే కథ కూడా అందిస్తున్నారు. ‘ఎన్ఎస్ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ మూవీని వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాస్ రావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి నిర్మిస్తున్నారు. 

‘ఎన్ఎస్ 24’ (NS24) చిత్రంలో నాగశౌర్య కొత్త లుక్‌తో మెస్మరైజ్ చేయబోతున్నారట. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారని టాలీవుడ్ టాక్. బేబీ అద్వైత, భవిష్య సమర్పణలో రాబోతున్న ఈ మూవీ త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ చిత్రం తెరకెక్కబోతోందట. టైటిల్‌తోపాటు హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తోంది. నాగశౌర్య వెంటవెంటనే సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారి నారి నడుమ మురారి’, ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలతోనైనా నాగశౌర్య కెరీర్ సక్సెస్ ట్రాక్‌లో పడుతుందేమో చూడాలి.  

Read more: స్నేహా రెడ్డి (Sneha Reddy)కి సినిమా ఛాన్స్!.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న బన్నీ (Allu Arjun) భార్య?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!