ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం ఈజీనే.. ఇక్కడ ఉండటమే చాలా కష్టం: యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya)

Updated on Nov 03, 2022 11:26 AM IST
సినీ పరిశ్రమలోకి రావడం సులువేనని.. అయితే ఇక్కడ కొనసాగడం చాలా కష్టమని నాగశౌర్య (Naga Shaurya) అన్నారు
సినీ పరిశ్రమలోకి రావడం సులువేనని.. అయితే ఇక్కడ కొనసాగడం చాలా కష్టమని నాగశౌర్య (Naga Shaurya) అన్నారు

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్డడం అంత కష్టమేమీ కాదని.. ఇండస్ట్రీలోకి వచ్చి ఉండటమే కష్టమని యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) అన్నారు. ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ (Bomma Blockbuster) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ప్రసంగించారు. ప్రముఖ నటుడు నందు, యాంకర్ రష్మి జంటగా దర్శకుడు రాజ్ విరాట్ తెరకెక్కించిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ మూవీ నవంబర్ 4న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు నాగశౌర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ ఈవెంట్‌లో నాగశౌర్య పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’తో నందు మంచి హిట్ అందుకోవాలని తాను కోరకుంటున్నానని అన్నారు. ప్రేక్షకులకు తాను, నందు (Nandu) తెలియకపోవచ్చేమో గానీ రష్మి ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ‘ఇటీవల విరాట్ కోహ్లీ సిక్స్ కొట్టి టీమిండియాను ఎలా గెలిపించారో.. ఆ పేరున్న మీరూ (డైరెక్టర్) ఈ సినిమాతో హిట్ కొడతారని ఆశిస్తున్నా. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పుడే అసలైన కష్టం మొదలవుతుంది. ఇండస్ట్రీలోకి రావడం పెద్ద కష్టమేం కాదు.. కానీ ఇక్కడ కొనసాగడమే కష్టం’ అని నాగశౌర్య చెప్పుకొచ్చారు. 

‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ (Bomma Blockbuster) చిత్రంతో నందు (Nandu) మంచి హిట్ అందుకోవాలని నాగశౌర్య (Naga Shaurya) కోరుకున్నారు

‘బొమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రం ట్రైలర్ నాకు బాగా నచ్చింది. టీమ్ ఎంత కసిగా పనిచేశారో తెలుస్తోంది. ఈ సినిమా కోసం నందు, రష్మి బాగా ప్రచారం చేశారు. మా అందరికీ నటన తప్ప ఇంకేం తెలియదు. నేను 2007 చివర్లో ఇండస్ట్రీలోకి వచ్చా. అప్పటికే నందు హీరో. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఓపికగా ఉన్నాడు. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో విజయం సాధిస్తాడని కోరుకుంటున్నా. నా మూవీ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నువ్వూ వస్తావ్. ఆ స్థాయికి వెళ్తావనే నమ్మకం ఉంది’ అని నాగశౌర్య పేర్కొన్నారు.  

ఇకపోతే, విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ మూవీకి రాజ్ విరాట్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కు అటు ప్రేక్షకులతోపాటు ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. నందు, రష్మి (Rashmi Gautam) కూడా ఆడియెన్స్‌లోకి సినిమాను తీసుకెళ్లేందుకు జోరుగా ప్రమోషన్లు చేస్తున్నారు. దీంతో ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Read more: 'కాంతార' (Kantara) సినిమాను తెలుగులో తీసుంటే ఈజీగా రూ.200 కోట్ల బడ్జెట్ అయ్యేది!: తమ్మారెడ్డి భరద్వాజ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!