స్నేహా రెడ్డి (Sneha Reddy)కి సినిమా ఛాన్స్!.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న బన్నీ (Allu Arjun) భార్య?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి (Sneha Reddy) గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. కొడుకు, కూతురుతో కలసి బన్నీ చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వరుస ఫొటో షూట్స్‌తో స్నేహా రెడ్డి బాగా పాపులర్ అయ్యారు. అదిరిపోయే ఆమె లుక్స్‌కు నెటిజన్లు వహ్వా అంటున్నారు.
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం, గ్లామర్‌తో అందరి మనసులు దోచుకుంటున్న ఈ అల్లువారి కోడలు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. మలయాళ చిత్రపరిశ్రమ నుంచి స్నేహకు ఓ ఆఫర్ వచ్చిందని సమాచారం. అంతేకాకుండా ఇందులో మలయాళ స్టార్ హీరో నటించనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమెకు మూవీల్లో యాక్ట్ చేసే ఆసక్తి ఉంటే టాలీవుడ్ కాకుండా మాలీవుడ్‌ను ఎంచుకుంటారా అనే విషయం పైనా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై స్నేహా రెడ్డి స్పందిస్తారేమో చూడాలి.
ఇకపోతే, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ‘పుష్ప’ పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. దీంతో నార్త్ ఆడియెన్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని తదుపరి ప్రాజెక్టులను ఎంపిక చేయాలని బన్నీ ఆలోచిస్తున్నారట. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌కు చెందిన కొందరు దర్శకులు ఆయనకు పలు కథలు వినిపించారని సమాచారం. అయితే నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుపై ఇంకా క్లారిటీ రాలేదు. ‘పుష్ప’ సీక్వెల్ షూటింగ్ ముగిసే సమయానికైనా దీనిపై స్పష్టత రావొచ్చు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆయన నుంచి వేగంగా సినిమాలు రావాలని ఆశిస్తున్నారు.
Read more: EXCLUSIVE : కష్టాన్ని కూడా ఇష్టపడాలి.. అదే నా విజయ రహస్యం : సంగీత దర్శకుడు రఘు కుంచె (Raghu Kunche)