'కృష్ణ వ్రింద విహారి' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డ్యాన్సులతో అలరించిన నాగ‌శౌర్య (Naga Shourya), షెర్లీ సెటియా !

Published on Sep 21, 2022 05:16 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య (Naga Shourya) హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari). షెర్లీ సెటియా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు అనీశ్ ఆర్.కృష్ణ ద‌ర్శ‌కుడు. గత కొంతకాలంగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడుసార్లు వాయిదాపడ్డ ఈ సినిమా రిలీజ్, ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. 

కాగా, ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను సెప్టెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. 

ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్లు నాగ‌శౌర్య, షెర్లీ సెటియా డ్యాన్సులతో అదరగొట్టారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

'కృష్ణ వ్రింద విహారి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Krishna Vrinda Vihari PreRelease Event) వేదికపై హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. "కోవిడ్ కారణంగా చాలామంది ఆర్ధికంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.. అలాంటివారిలో మేము కూడా ఉన్నాము. సినిమా పట్ల ప్రేమతో కాదు.. నా పట్ల గల అనురాగంతో మా పేరెంట్స్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను  థియేటర్లోనే విడుదల చేయాలనే  ఉద్దేశంతో వడ్డీలపై వడ్డీలు కడుతూ వచ్చారు. నిజంగా ఇలాంటి పేరెంట్స్  దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మా అమ్మానాన్నలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.

దర్శకుడు అనీష్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను తన భుజంపై వేసుకుని ముందుకు నడిపించిన నాగశౌర్యకు ముందుగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో రాధికగారు కీలక పాత్ర పోషించారు. ఆమె లేకపోతే సినిమాపై మేమింత నమ్మకంగా ఉండేవాళ్లం కాదు. న్యూజిలాండ్‌లో పెరిగిన హీరోయిన్ షిర్లీ సేతియా (Shirley Setia) తెలుగులో సంభాషణలు చెప్పటాన్ని చూసి ఆశ్చర్యపోయా. తన పాత్రకే తానే డబ్బింగ్‌ చెప్పుకొంది’’ అని  తెలిపారు.

Read More: నవ్వులు పూయిస్తున్న 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari) ట్రైలర్.. నాగశౌర్యకు హిట్ దక్కినట్లేనా..?