Krishna Vrinda Vihari Movie Review : కామెడీకి పెద్ద పీట వేస్తూ సాగిపోయిన డ్రామా చిత్రం “కృష్ణ వ్రింద విహారి”

Updated on Sep 23, 2022 07:36 PM IST
నాగశౌర్య (Naga Shaurya) .. టాలీవుడ్ యువ నటుడు. కానీ సరికొత్త సబ్జెక్టులతో ప్రయోగాలు చేయడంలో ఈయన దిట్ట.
నాగశౌర్య (Naga Shaurya) .. టాలీవుడ్ యువ నటుడు. కానీ సరికొత్త సబ్జెక్టులతో ప్రయోగాలు చేయడంలో ఈయన దిట్ట.

నటీనటులు: నాగ శౌర్య, షిర్లే సెటియా, రాధిక, వెన్నెల కిషోర్

దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ

నిర్మాత: ఉషా ముల్పూరి

సంగీతం: మహతి స్వరసాగర్

రేటింగ్ : 3/5

ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజైన తెలుగు చిత్రాలలో పేరెన్నిక గల చిత్రం  “కృష్ణ వ్రింద విహారి” (Krishna Vrinda Vihari). దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు నాగశౌర్య (Naga Shaurya) కథానాయకుడిగా , షిర్లే షెటియా కథానాయికగా నటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారమందుకున్న ఈ చిత్రం, ఎలా ఉందో మనమూ తెలుసుకుందాం రండి. 

కథ :

ఈ సినిమాలో హీరో కృష్ణాచారి(నాగ శౌర్య) ఓ బ్రాహ్మణ కుర్రాడు. సాఫ్ట్‌వేర్ కొలువు రావడంతో భాగ్యనగరం బాటపడతాడు. ఈ నగరంలోనే వ్రిందా(షిర్లే) అనే అమ్మాయిని చూసి పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు. కానీ ఇక్కడే అతడికి కుటుంబపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కృష్ణాచారి తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఎలాగోలా కష్టపడి వ్రిందను పెళ్లాడిన కృష్ణ ఎదుర్కొన్న అనుభవాలేమిటి? ఈ క్రమంలో అతను ఆడే చిన్న చిన్న అబద్ధాలు ఎలా సమస్యలను మరింత పెద్దవిగా చూపిస్తాయో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

సానుకూల అంశాలు
ఈ సినిమాలో నాగశౌర్య (Naga Shaurya) పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే తాను కూడా తన నటనలో మంచి పరిణితిని కనబరిచాడు. కొన్ని చోట్ల మంచి కామెడీని కూడా పండించాడు. అమాయక బ్రాహ్మణ కుర్రాడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే కథానాయిక షిర్లే సెటియా కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. ఈ సినిమాకి ఆమె నటనే ప్లస్ పాయింట్. 

లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే సీనియర్ నటి రాధిక కూడా ఈ సినిమాలో చాలా మంచి పాత్ర పోషించారు. చాలా రోజుల తర్వాత తెలుగు తెర మీద తన మార్కు నటనతో అలరించారు. ఒక రకంగా ఈ సినిమాకి కథనమే బలం. 

ప్రతికూల అంశాలు 
ఈ సినిమా కామెడీ ప్రధానమైన చిత్రం కావడంతో, దర్శకుడు దాని మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. దీంతో కథ కొన్ని చోట్ల పక్కదారి పట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. 

భావోద్వేగాలు బలంగా పండాల్సిన సీన్లలో కూడా ఏదో మిస్ అయినట్లు మనకు అనిపిస్తుంది. అంతకుమించి కొన్ని చోట్ల కథలో లాజిక్ కూడా ఉండదు. అయినా సినిమా అలా సాగిపోతూనే ఉంటుంది. 

టెక్నికల్ అంశాలు :
ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సంభాషణలు కూడా సందర్భానుసారంగా కథకు బలాన్ని చేకూర్చే విధంగానే ఉన్నాయి. మహతి సాగర్ పాటలకు మంచి బాణీలు సమకూర్చాడు. 

ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే, అనీష్ కృష్ణ తన తొలి చిత్రమైనా, కథను ఆసక్తికరంగా నడపడంలో సక్సెస్ అయ్యారు. కామెడీని బాగా పండించారు. అయితే కథ సాదాసీదాగానే ఉంటుంది. 

ఫైనల్ వర్డ్ : సాదాసీదాగా సాగిపోయే కామెడీ డ్రామా ఈ “కృష్ణ వ్రింద విహారి”  (Krishna Vrinda Vihari)

Read More: కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) గురించి టాప్ 10 ఆసక్తికర విషయాలు మీకోసం

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!