టాలీవుడ్ హీరోలపై అమెరికన్ నటి రెబెకా గ్రాంట్(RebeccaGrant) ఆసక్తికర ట్వీట్.. ‘తొలి పవర్ స్టార్’ ఎవరంటూ ప్రశ్న?

Updated on Oct 27, 2022 11:54 AM IST
తాజాగా అమెరికన్ నటి రెబెకా గ్రాంట్ (Rebecca Grant) టాలీవుడ్ హీరోల (Tollywood Heros) గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు.
తాజాగా అమెరికన్ నటి రెబెకా గ్రాంట్ (Rebecca Grant) టాలీవుడ్ హీరోల (Tollywood Heros) గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు.

టాలీవుడ్.. పాన్ ఇండియా సినిమాలతో తెలుగు హీరోల పేర్లు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' (Bahubali) సినిమాతో తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో దేశమంతా తెలిసింది. 'బాహుబలి'తో ప్రభాస్.. 'పుష్ప'తో అల్లు అర్జున్ (Allu Arjun).. 'ఆర్ఆర్ఆర్'తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా మన హీరోల పేర్లు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో మనవాళ్ల యాక్టింగ్‌ను చూసిన విదేశీయులు కూడా మెచ్చుకుంటున్నారు.

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఏడు నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఇటీవలే జపాన్ భాషలోనూ విడుదలైంది. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' టీం జపాన్ వెళ్లి మరీ అక్కడ ప్రమోషన్స్ చేశారు. ఫలితంగా ఈ  సినిమా జపాన్ లోనూ మంచి కలెక్షన్లను రాబడుతూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికన్ నటి రెబెకా గ్రాంట్ (Rebecca Grant) టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. ఈ సినిమాను చూసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హీరో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికంటే ముందు టాలీవుడ్ లో పవర్ స్టార్ ఎవరు? అంటూ అభిమానులను రెబెకా గ్రాంట్ ప్రశ్నించింది. 

ఈ క్రమంలో నెటిజన్స్ స్పందిస్తూ.. తెలుగులో మెగాస్టార్ ఒక్కరే స్వయం కృషితో పైకి ఎదిగాడని చెప్పారు. దీంతో రెబెకా.. “అవునా! ప్రభాస్ (Prabahs), రామ్ చరణ్ (Ram Charan) లకంటే ముందు చిరంజీవినే పవర్ స్టార్ అయితే.. నేను ఆయన సినిమాలు చూడాలంటే ఎలా? ఆయన సినిమాలలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్న సినిమాలేవైనా నాకు సజెస్ట్ చేయండి” అంటూ రిప్లై ఇచ్చింది.

దీనికి మెగాస్టార్‌ చిరంజీవిని (Megastar Chiranjeevi) కూడా ట్యాగ్‌ చేసింది. దీంతో ఆమె ట్వీట్ కు మెగా ఫ్యాన్స్‌ స్పందిస్తున్నారు. మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో తమకు తోచిన చిరు హిట్‌ చిత్రాల పేర్లను సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: చిరంజీవి ‘మెగా 154’ (Mega 154) నుంచి క్రేజీ అప్డేట్.. ''బాస్ వస్తున్నాడు''.. టైటిల్ టీజర్ రేపే విడుదల..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!