Mahesh Babu: కోరమీసం, గడ్డంతో సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ వైరల్.. త్రివిక్రమ్(Trivikram) సినిమా కోసమేనా?

Updated on Aug 06, 2022 02:21 PM IST
మహేష్ బాబు (Mahesh Babu).. ‘బ్లూ కలర్ టీ షర్ట్‌లో క్యాజువల్‌గా ఫోన్ మాట్లాడుతూ సైడ్ యాంగిల్‌లో ఓరగా చూస్తున్నాడు’.
మహేష్ బాబు (Mahesh Babu).. ‘బ్లూ కలర్ టీ షర్ట్‌లో క్యాజువల్‌గా ఫోన్ మాట్లాడుతూ సైడ్ యాంగిల్‌లో ఓరగా చూస్తున్నాడు’.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) చిత్రంతో హిట్ కొట్టి తన కెరీర్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం చెవికి పోగుతో పాటు.. గుబురు జుట్టు పెంచుకుని.. అంతకు ముందు సినిమాల కంటే మరింత గ్లామరస్‌గా కనిపించారు.  ఇప్పుడు త్రివిక్రమ్ (Director Trivikram) సినిమా కోసం  సరికొత్త మేకోవర్ లుక్‌లో కనిపిస్తున్నారు మహేష్ బాబు.  

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ప్రస్తుతం మూడో సినిమా చేస్తున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న తరుణంలో, మహేష్ తాజా లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ (Mahesh Babu Look Viral) గా మారింది. మరో రెండు వారాలలో మొదలుకానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం తాజాగా గుబురు గడ్డంతో మహేష్ బాబు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చారు. 

ఇక, ఈ ఫోటో విషయానికి వస్తే  మహేష్ బాబు (Mahesh Babu) .. ‘బ్లూ కలర్ టీ షర్ట్‌లో క్యాజువల్‌గా ఫోన్ మాట్లాడుతూ, సైడ్ యాంగిల్‌లో ఓరగా చూస్తున్నాడు’. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది త్రివిక్రమ్‌కు సినిమాకి సంబంధించిన లుక్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.   

ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం మహేష్ బాబు లుక్‌ గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. మహేష్ బాబుని (Mahesh Babu)  గడ్డంలో కొందరు ఇష్టపడితే.. మరి కొందరు మాత్రం ‘లుక్ అస్సలు బాలేదు‘ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే.. " మహేష్ బాబుని 20 సంవత్సరాల నుంచి గడ్డం లేకుండా చూశాము.

ఇప్పుడు కూడా గడ్డం లేకుండానే చూడాలనుకుంటున్నాం. గడ్డంతో మహేష్ బాబుని చూడడం వల్ల ముసలాడు అయ్యాడు అనే అభిప్రాయం వచ్చేస్తుంది. కనుక మహేష్ బాబుని గడ్డం లేకుండా చూడడమే మాకు ఇష్టం" అంటూ అభిమానులు చెబుతున్నారు.

Read More: మహేష్ బాబు (Mahesh) పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' స్పెషల్ షో.. గంటలోనే థియేటర్లన్నీ హౌస్ ఫుల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!