మహేష్ బాబు - త్రివిక్రమ్ (Mahesh-Trivikram) సినిమా నుంచి బిగ్ అప్ డేట్.. తొలి సారి డబుల్ రోల్‌లో సూపర్ స్టార్!

Updated on Jul 25, 2022 08:13 PM IST
మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం ఇది. దీంతో అభిమానులు కూడా ఈ సినిమా మీద చాలా ఆశ‌లు పెట్టుకున్నారు.  వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde), ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో మహేష్ సరసన 'మహర్షి ' సినిమాలో పూజాహెగ్డే నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్‌తో కలిసి ఆమె రొమాన్స్ చేయనుంది.

ఈ సినిమా ఓ పీరియాడిక్ డ్రామా అని.. ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకి చాలా కీలకమని అంటున్నారు. అలాగే ఇదే చిత్రంపై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.     

ఇక మహేష్ పోషించే రెండు పాత్రలను త్రివిక్రమ్ (Director Trivikram) డిజైన్ చేసిన తీరు, ఈ క్రమంలో షూట్ చేసే పలు సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. ఫైట్ మాస్టర్లు రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘సంక్రాంతి’కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరి, నిజంగానే మహేష్ ద్విపాత్రాభినయం చేస్తే.. ఈ సినిమా పై అభిమానుల అంచనాలు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు.

కాగా, మహేష్ బాబు ఇటీవలే 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ స్టైల్, బాడీలాంగ్వేజ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత, త్రివిక్రమ్ కాంబోలో మహేష్ సినిమా చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్.. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Read More: మ‌హేష్‌ (Mahesh Babu), త్రివిక్ర‌మ్ కాంబో 'ఎస్ఎస్ఎంబి 28' ఆగ‌స్టులో మొద‌లు!.. విడుద‌ల ఎప్పుడంటే..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!