Pokiri Movie: మహేష్ బాబు (Mahesh) పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' స్పెషల్ షో.. గంటలోనే థియేటర్లన్నీ హౌస్ ఫుల్!
Pokiri Movie: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ఇలియానా జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పోకిరి ”. ఇందిర ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ మూవీ 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయి ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా ద్వారా మహేశ్ బాబు కు బిగ్గెస్ట్ బ్రేక్ అందుకొని టాలీవుడ్ లో లీడింగ్ స్టార్ హీరోగా స్థానం దక్కించుకున్నాడు. కాగా, అప్పటివరకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది పోకిరి (Pokiri). ఈ సినిమా ఆరోజుల్లోనే 40కోట్ల షేర్‌ని, 70 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇక, ఈ సినిమా విడుదలయ్యేనాటికి అవే హైయ్యేస్ట్ కలెక్షన్లు కావడం విశేషం. అలాంటి సంచలనాలు సృష్టించిన ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'పోకిరి' (Pokiri) సినిమాను ప్రపంచవ్యాప్తంగా కొన్ని థియేటర్లలో ప్రత్యేక షోస్ వేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'పోకిరి'మూవీ ని 4K రిజల్యూషన్ (4K UHD)లోకి రీ మాస్టర్ చేసి డాల్ఫీ ఆడియోతో రిలీజ్ చేయనున్నారు. కాలిఫోర్నియాలోనూ పోకిరి స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే బుకింగ్స్ మొదలైన గంటలోపే టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి.
ఇక 'పోకిరి' (Pokiri Movie) చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడ కూడా ఘన విజయాలు సాధించింది. తెలుగులో మహేష్ బాబు డైలాగ్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. మహేష్, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించన పోకిరిలో ఒక్కో పాట ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ముందుగా మహేష్‌కి బదులు మాస్ మహారాజ్ రవితేజని (Raviteja) అనుకున్నారు. అంతే కాకుండా 'ఉత్తమ్ సింగ్', 'సన్నాఫ్ సూర్య నారాయణ' అనే టైటిల్ కూడా ముందుగా అనుకున్నారట. కానీ రవితేజతో సెట్ కాలేదు. దీంతో మహేష్ వద్దకి వెళ్లి ఆయన కెరీర్ ను మార్చిన సినిమాగా మారింది.