త‌మిళ హీరోకు మ‌హేష్ బాబు (Mahesh Babu) స‌పోర్ట్.. శివ కార్తికేయ‌న్ సినిమా టైటిల్ రిలీజ్

Updated on Jul 17, 2022 11:55 AM IST
శివకార్తికేయ‌న్ న‌టించ‌బోయే సినిమా తెలుగు టైటిల్‌ను మ‌హేష్ బాబు (Mahesh Babu) రిలీజ్ చేశారు.
శివకార్తికేయ‌న్ న‌టించ‌బోయే సినిమా తెలుగు టైటిల్‌ను మ‌హేష్ బాబు (Mahesh Babu) రిలీజ్ చేశారు.

టాలీవుడ్‌లో మ‌హేష్ బాబు (Mahesh Babu) వ‌రుస హిట్ సినిమాల‌తో దూకుడు మీద ఉన్నారు. మ‌హేష్ బాబు మేజ‌ర్ సినిమాను నిర్మించి.. దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశారు. రోజు రోజుకు మ‌హేష్ బాబుకు ఫాలోయింగ్ పెరుగుతుంది. అంతేకాకుండా ప‌లు హీరోల‌కు మ‌హేష్ బాబు స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. 

మ‌హావీరుడిగా శివ‌కార్తికేయ‌న్
త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ కొత్త సినిమా రాబోతుంది. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. 

టైటిల్ రిలీజ్ చేసిన మ‌హేష్ బాబు  (Mahesh Babu)
శివకార్తికేయ‌న్ న‌టించ‌బోయే సినిమా తెలుగు టైటిల్‌ను మ‌హేష్ బాబు రిలీజ్ చేశారు. మ‌హావీరుడు అనే టైటిల్‌ను విడుద‌ల చేశారు. శివకార్తికేయ‌న్‌కు మ‌హేష్ బాబు (Mahesh Babu) శుభాకాంక్షలు తెలిపారు. శివకార్తికేయన్ కొత్త సినిమా మ‌హావీరుడులో మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. టైటిల్ రిలీజ్ వీడియోలో మాస్ ఫైటింగ్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఇక సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే అంచాలు మ‌రింత పెరిగాయి.

మ‌ణిర‌త్నం సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన మ‌హేష్‌
మ‌హేష్ బాబు పొన్నియిన్ సెల్వ‌న్ 1 (Ponniyin Selvan 1) తెలుగు వ‌ర్ష‌న్ టీజ‌ర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్ర టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. త‌న‌కు ఇష్ట‌మైన డైరెక్ట‌ర్ల‌లో మ‌ణిర‌త్నం ఒక‌ర‌ని మ‌హేష్ తెలిపారు. ఈ చిత్ర టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం థ్రిలింగ్‌గా ఉంద‌న్నారు.  పొన్నియిన్ సెల్వ‌న్ 1 సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని మ‌హేష్ బాబు (Mahesh Babu) తెలిపారు. 

Read More: Mahesh Babu : మహేష్ బాబు‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. సంబరాలలో ఫ్యాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!