Prabhas: ప్రభాస్ కుటుంబం ఆధ్వర్యంలో 70,000 మందికి భోజనం పంపిణీ.. కృష్ణంరాజు సంస్మరణ సభలో భారీ అన్న సమారాధన !
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) ఇటీవలే స్వర్గస్థులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్ (Prabhas) తన పెదనాన్న సంస్మరణ సభలో తన ఆధ్వర్యంలో దాదాపు 70,000 మందికి భోజన ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 28వ తేదిన మొగల్తూరుకి వెళ్లి, అక్కడే తన కుటుంబ సభ్యులతో రెండు రోజులు గడపనున్నారు.
12 సంవత్సరాల తర్వాత ..
12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ (Prabhas) తన స్వగ్రామానికి వెళ్లడం విశేషం. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు 2010 లో మరణించారు. ఆ సమయంలో కూడా ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించగా.. సంస్మరణ కార్యక్రమాన్ని మొగల్తూరులోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు తన పెదనాన్న సంస్మరణ కార్యక్రమానికి కూడా ఏర్పాట్లను ప్రభాస్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం.
మొగల్తూరులో వేగంగా జరుగుతున్న పనులు
ముఖ్యంగా తమ పూర్వీకుల ఇంటికి రంగులు వేయించడంతో పాటు, 50 మంది కార్మికులతో ఫర్నిచర్ వర్క్ కూడా చేయిస్తున్నారని సమాచారం. అలాగే, సభకు సంబంధించి ఇతరత్రా పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో, మొగల్తూరులో కూడా హడావిడి వాతావరణం నెలకొంది.
అలాగే భోజన ఏర్పాట్ల కోసం, వంటల తయారీకి ద్రాక్షారామం నుండి ప్రత్యేకంగా వంటవాళ్లను రప్పించినట్లు సమాచారం. కృష్ణంరాజు (Krishnam Raju) ప్రతి సంవత్సరం రెండు సార్లు తన సొంతూరికి కచ్చితంగా వచ్చేవారట. మొగుల్తూరు వాసులందరికీ ఆయన సుపరిచితమే.
కృష్ణంరాజు సంస్మరణ సభ 28వ తేదిన మొగల్తూరులో జరిగినా.. అంతకు ముందే 23వ తేదిన ఆయన దశదిన కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనుంది.
Read More: ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ సినిమాకి కాన్సెప్ట్ ఆర్ట్ డిజైన్ చేసిన అభిమాని.. నెట్టింట ఫోటో వైరల్