అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన ‘హిట్‌-2’ (HIT 2) నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే టీజర్ విడుదల!

Updated on Nov 02, 2022 06:13 PM IST
తాజాగా ‘హిట్‌-2’ (HIT 2 Teaser) చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది.
తాజాగా ‘హిట్‌-2’ (HIT 2 Teaser) చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది.

విశ్వక్ సేన్ (Vishwak sen) హిట్ హీరోగా 2020లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న మూవీ 'హిట్ ' (HIT Movie). చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాల్లో 'హిట్' ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. 

దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌, విజన్‌తో ప్రేక్షకులను సినిమా చివర వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఇక, ఈ చిత్రంతో నిర్మాతగా నాచురల్ స్టార్ నానికి (Hero Nani) భారీ హిట్ వచ్చింది. వాల్ పోస్టర్ బ్యానర్ పై డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సిక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కుతున్న ‘హిట్‌-2’ (HIT 2) ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 2న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తోంది.

తాజాగా ‘హిట్‌-2’ (HIT 2 Teaser) చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. 'హిట్ ది సెకండ్ కేస్' సినిమా టీజర్ ను రేపు అనగా నవంబర్ 3వ తేదీన ఉదయం గం.11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ టీజర్ ను "ఏఎంబి సినిమాస్" స్క్రీన్ వన్ లో ప్రసారం చేయనున్నట్లు కూడా చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రావు రమేష్, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రసాద్ తిపిరనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Read More: హిట్ 2 (Hit 2) కొత్త పోస్టర్ విడుదల: అడివి శేష్ (Adivi Sesh) సినిమాపై భారీ అంచనాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!