Ante Sundaraniki: ‘అంటే సుంద‌రానికి..’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాని నజ్రియా.. వీడియో వైరల్!

Published on Jun 11, 2022 03:35 PM IST

Ante Sundaraniki: నాచుర‌ల్ స్టార్ నాని రీసెంట్‌గా అంటే సుంద‌రానికి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాని డిఫెరెంట్ పాత్రలో నటించాడు. ముందు నుంచీ పాజిటివ్ బజ్ ఏర్పడడం వల్ల ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు కేవలం రూ.3.87 కోట్ల షేర్ తో రూ.6.50 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇది ఫ్యూర్ క్లాస్ మూవీ అని నాని (Naturalstar Nani) అభిమానులకు మాత్రమే మెప్పిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా అంత తక్కువ ఓపెనింగ్స్ రావడానికి కారణం అని తెలుస్తోంది. గతంలో 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు నాని హిట్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ అంత వసూళ్లు మాత్రం రాబట్టలేక పోయింది.అయితే ఇప్పుడు అంటే సుందరానికి సినిమా మాత్రం మంచి టాక్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా చూసి ప్రేక్ష‌కులు తెగ న‌వ్వేసుకుంటున్నారు. అద్భుతమైన కామెడీని పండించడంతో సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఇక సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో టీం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంది. 

ఈ క్ర‌మంలో నాని అందాల ముద్దుగుమ్మ‌లు న‌జ్రియా, నివేదా థామ‌స్‌ (Nivetha Thomas)తో క‌లిసి సెల్ఫీ దిగారు. ఈ పిక్ నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇద్ద‌రు భామ‌ల‌తో నాని దిగిన ఫొటో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న మరో యాక్షన్ ఫిల్మ్ ‘దసరా’. ఈ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘దసరా’ నాని మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ గా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల్లోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథగా అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.