Chiranjeevi : చిరంజీవితో 'మారుతి' సినిమా .. పక్కా కమర్షియల్ (Pakka Commerical) దర్శకుడికి చిరు ప్రామిస్ !

Updated on Jun 27, 2022 11:59 AM IST
మారుతి తన కమిట్‌‌మెంట్స్ పూర్తి చేసుకొని వచ్చి నాకు కథ వినిపిస్తే, కచ్చితంగా ఆయనతో ఓ సినిమా చేస్తాను" అని చిరంజీవి (Chiranjeevi) తెలిపారు.
మారుతి తన కమిట్‌‌మెంట్స్ పూర్తి చేసుకొని వచ్చి నాకు కథ వినిపిస్తే, కచ్చితంగా ఆయనతో ఓ సినిమా చేస్తాను" అని చిరంజీవి (Chiranjeevi) తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవలే 'ఆచార్య' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అయితే ఆ చిత్రం ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం చిరు లిస్టులో ఎన్నో సినిమాలు ఉన్నాయి. వాల్తేరు వీరయ్య, భోళాశంకర్, గాడ ఫాదర్ చిత్రాలను ఆయన చేస్తున్నారు. అయితే వీటితో పాటు మరో దర్శకుడితో తనకు పనిచేయాలని ఉందని చెబుతూ.. ఆ ఆసక్తిని కూడా బయటపెట్టారు చిరంజీవి (Chiranjeevi). 

మారుతి ఓ టాలెంటెడ్ దర్శకుడు

ఇటీవలే గోపిచంద్ కథానాయకుడిగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరు మాట్లాడుతూ "ఈ సినిమా నిర్మాతలు విక్కీ, ప్రమోద్‌లు చరణ్‌‌కు మంచి మిత్రులు. ఎన్నోసార్లు వారితో మాట్లాడాను. అలాగే మారుతి కూడా టాలెంటెడ్ డైరెక్టర్. ఈ టీమ్‌తో నాకు సినిమా చేయాలని ఉంది.

మారుతి తన కమిట్‌‌మెంట్స్ పూర్తి చేసుకొని వచ్చి నాకు కథ వినిపిస్తే, కచ్చితంగా ఆయనతో ఓ సినిమా చేస్తాను" అని చిరంజీవి (Chiranjeevi) తన మనసులోని మాటను బయటపెట్టారు. 

పక్కా కమర్షియల్ (Pakka Commerical) చిత్రం జులై 1, 2022 తేదిన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. సత్యరాజ్, అనసూయ, రావు రమేష్, అజయ్ ఘోష్, సప్తగరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే జేక్స్ బిజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 

పక్కా కమర్షియల్ డిజిటల్ హక్కులు ఎవరికంటే ?

పక్కా కమర్షియల్ (Pakka Commerical) సినిమాపై గోపీచంద్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఓ వైవిధ్యమైన కథతో గోపీచంద్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లాయర్ గెటప్‌లో ఆయన చెబుతున్న డైలాగ్స్ టీజర్‌లో ఫ్యాన్స్‌కి కావాల్సినంత ఫన్‌ను జనరేట్ చేశాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్‌తో పాటు ఆహా ఓటీటీ సంస్థలు దక్కించుకోవడం గమనార్హం. 

ఇక డైరెక్టర్ మారుతి విషయానికి వస్తే, పక్కా కమర్షియల్ (Pakka Commerical) సినిమాకి ముందు ఆయన ఆహా ఓటీటీ కోసం త్రీ రోజెస్ పేరుతో ఓ వెబ్ సిరీస్ ను అందించారు. అలాగే శైలాజా రెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే, మంచిరోజులొచ్చాయి లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.

Read More: గోపిచంద్ 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' ప‌క్కా హిట్ సాధిస్తుంద‌న్న‌ చిత్ర యూనిట్

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!