Kajal Aggarwal: మాతృత్వపు మాధుర్యాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. కొడుకు ఫొటో వైరల్!

Updated on Jun 21, 2022 04:33 PM IST
కొడుకుతో కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal her Son)
కొడుకుతో కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal her Son)

Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ గత కరోనా టైంలో ముంబయికి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చి తల్లయింది. ప్రస్తుతం మాతృత్వపు మధురిమల్లో మునిగి తేలుతోంది. ఆ చిన్నారికి నీల్ అని పేరు పెట్టుకొని.. తన జీవితంలోని ఆనంద క్షణాల్ని అనుభవిస్తోంది. అయితే ఇంతవరకూ ఆమె తన బిడ్డ ముఖాన్ని అభిమానులకు చూపించలేదు.  

అయితే తాజాగా కాజల్ తన బిడ్డకు సంబంధించిన మరో ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో దాదాపుగా చిన్నారి ఫేస్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఫోటోలో బెడ్ పై పడుకొని తన కొడుకు ముఖం చూస్తూ ఉంది. ఈ ఫోటోని షేర్ చేసి నా జీవితానికి ప్రేమ ఇతనే. నా హార్ట్ బీట్ కూడా ఇతనే అని తన కొడుకు గురించి ఎమోషనల్ గా (Emotional Post) పోస్ట్ పెట్టింది.

దీంతో ఇప్పుడు ఈ ఫోటోను కాజల్ అభిమానులు మరింత ఆసక్తిగా చూస్తున్నారు. చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీలు తమ పిల్లల ఫోటోలను పూర్తిగా చూపించకుండా మొహం కనిపించకుండా అందుకు అనుగుణంగా వివిధ రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

క్రికెటర్ కోహ్లీ, అనుష్క కూడా తమ కూతురు ఫోటో ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇక కాజల్ కూడా తన కొడుకు పుట్టినప్పటి నుంచి తన కొడుకు సంబంధించిన ఫోటోలు ఏవీ లీక్ కాకుండా కూడా సోషల్ మీడియాలో రాకుండా జాగ్రత్త పడుతోంది. కాజల్ అగర్వాల్ తన కొడుకుకి నీల్ కిచ్లూ (Neel Kichlu) అనే పేరును కూడా పెట్టేశారు. అయితే కాజల్ మాత్రం తల్లి అవ్వడంతో తెగ సంతోషిస్తున్నట్టు కనిపిస్తోంది. మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన బిడ్డను చూసుకుంటూ కాజల్ మురిసిపోతోంది. మొత్తానికి కాజల్ ఇప్పుడు తన కొడుకు ఫోటోను షేర్ చేసింది. 

కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ తేజ నిర్మించిన 'లక్ష్మీ కల్యాణం' చిత్రం ద్వారా తెలుగులో 2007లో వెండితెరకు పరిచయం అయ్యింది. 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

2009లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌ లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని (Ram Pothineni) తో కలిసి గణేష్ , అల్లు అర్జున్ తో ఆర్య2 లో నటించింది. 

తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. ఇలా వరుసగా టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది కాజల్. చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా యాక్ట్ చేసింది.

ఆ తర్వాత  కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని (Gowtham kichlu) 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లాడింది. కరోనా టైంలో వీరి పెళ్లి సైలెంట్‌గా జరిగిపోయింది.

Read More:  Kajal Aggarwal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ నటించిన టాప్ టెన్ సినిమాలు (బర్త్‌డే స్పెషల్)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!