అమ్మ ప్రేమలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) బిడ్డ 'నీల్' .. ఫోటోలు వైరల్ !

Updated on Jun 20, 2022 09:54 PM IST
Kajal Aggarwal
Kajal Aggarwal

Kajal Aggarwal :  కాజల్ అగర్వాల్.. పాపులర్ తెలుగు సినీనటి. 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత మగధీర, ఆర్య 2, టెంపర్, ఖైదీ నెంబర్ 150, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించారు. అలాగే పలు హిందీ చిత్రాలలో కూడా నటించారు.

ఆ తర్వాత పెళ్లి చేసుకొని, తన సంసార జీవితాన్ని కూడా ప్రారంభించిన కాజల్.. ఇటీవలే ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యారు. నిన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన పుట్టినరోజు సందర్భంగా, సోషల్ మీడియాలో అనేక పోస్టులను షేర్ చేశారు. అందులో ప్రధానంగా తన బిడ్డతో దిగిన ఫోటో చాలా ఆకట్టుకొనే విధంగా ఉంది.

ఈ చిత్రంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. కాజల్ తొలిసారిగా ఈ ఫోటో ద్వారా తన కొడుకు ముఖాన్ని లోకానికి బహిర్గతం చేయడం విశేషం. అలాగే, తన బిడ్డను చేతులలోకి తీసుకుంటూ, ముద్దాడినట్లు ఫోటోకి ఆమె ఫోజ్ ఇచ్చారు.  

 

తన కొడుకుకి కాజల్ 'నీల్' అని ఇటీవలే నామకరణం చేశారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటోకి స్పందిస్తూ, ఎందరో చిత్ర ప్రముఖులు కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన కామెంట్‌లో "బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడని" వ్యాఖ్యలు చేశారు.

నిన్నే కాజల్ అగర్వాల్ తన 37 వ జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత మొదలైన వారు కాజల్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇటీవలే కాజల్ అగర్వాల్ ((Kajal Aggarwal) 'ఆచార్య ' సినిమాలో చిరంజీవి సరసన నటించారు. అయితే, కథాపరమైన మార్పుల వల్ల, సినిమాలో ఆమె నటించిన సన్నివేశాలను దర్శకుడు తొలిగించారట. 

Read More: టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ నటించిన టాప్ టెన్ సినిమాలు (బర్త్‌డే స్పెషల్)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!