Nayanatara: పెళ్లి తర్వాత నయనతార కొత్త కండిషన్స్.. దర్శక, నిర్మాతలకు చుక్కలే!

Updated on Jun 13, 2022 11:08 PM IST
నయనతార, విఘ్నేశ్ శివన్ (Nayanatara, Vignesh Shivan)
నయనతార, విఘ్నేశ్ శివన్ (Nayanatara, Vignesh Shivan)

కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార (Nayanatara), విఘ్నేశ్ శివన్‌‌ల జంట ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జూన్ 9 వ తేదీన తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో చాలా సింపుల్‌గా వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది ప్రముఖలే హాజరై ఆశీర్వదించారు. ఆ తరువాత తిరుముల శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట..ఓ ప్రెస్ మీట్ పెట్టి అభిమానులకు తమ పెళ్ళి పై అఫిషీయల్‌గా కొన్ని సంగతులు చెప్పారు. 

అయితే, హీరోయిన్లు పెళ్లి అయ్యాక, సినిమాల విషయంలో అనేక కోణాల్లో ఆలోచిస్తారు. ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మునుపటిలా నటించలేరు. నయనతార కూడా అందుకు మినహాయింపేమీ కాదంటున్నారు.

కెరీర్ ఆరంభంలో నయనతార (Nayanatara Marriage) ఎంత గ్లామర్‌గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చివరకి శృంగార సన్నివేశాల్లో సైతం నయన్ నటించింది. అందాలు ఆరబోస్తూ యువతని తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. క్రమంగా నయన్ గ్లామర్ రోల్స్ తగ్గిస్తూ వచ్చింది.

ఇటీవలి కాలంలో నయన్ అంతగా రొమాంటిక్, గ్లామర్ రోల్స్ చేయలేదు. తాజా సమాచారం మేరకు నయన్ పూర్తిగా గ్లామర్ రోల్స్‌కి దూరం కాబోతోందట. పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్, రొమాంటిక్ సీన్స్‌లో నటించకూడదు అని నిర్మాతలకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టబోతోందని టాక్. ఇప్పటి వరకు తనకు నచ్చిన పాత్రలే చేసిన నయన్ ఇక పై తాను ఏ సినిమాకి సైన్ చేయాలి అన్నా.. ఖచ్చితంగా భర్త విగ్నేశ్ శివన్ (Vignesh Shivan) కి కూడా నచ్చేలా ఉండేలా చూసుకోనుందట. తన దగ్గరికి వచ్చే డైరెక్టర్, నిర్మాతలకి ముందే కొన్ని కండీషన్స్ పెట్టి.. చుక్కలు చూపిస్తుందట నయన్.

ఇక, పెళ్ళి తరువాత.. బికినీలు, షార్ట్ డ్రెసుల్లు వేయదట. లిప్ లాక్ సీన్లు అస్సలుకే చేయనంటూ గట్టిగా చెప్పుతుందట. అంతేకాదు సినిమా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోను.. తన పాత్రకి ఖచ్చితంగా వాల్యూ ఉండాలి .. హీరో కూడా నాకు నచ్చిన వాళ్లే ఉండాలనే రూల్ పెట్టిందట . కేవలం నటనకు స్కోప్ ఉన్న రోల్స్ మాత్రమే చేయబోతోందని ప్రచారం జరుగుతోంది.

ముందుగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన పాత్రని బట్టి రొమాన్స్ లేకుండా, కమర్షియల్ చిత్రాలకు ఒకే చెప్పనుందని అంటున్నారు. అది కూడా బల్క్ అమౌంట్‌‌లో కాల్షీట్స్ ఇవ్వదట. స్లో అండ్ స్టడీ అన్నట్లుగా ఒక చిత్రం పూర్తయిన తర్వాతే మరో మూవీ విషయంలో నిర్ణయం తీసుకోనుంది. దీనివల్ల ఫ్యామిలీకి కూడా సమయం కేటాయించవచ్చు.

నయన్‌కి ఇప్పటికిప్పుడు సినిమాలు వదిలేసే ఆలోచన లేదు. నెమ్మదిగా సినిమాలకు దూరం కానుంది అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నయనతార సినిమా ప్రమోషన్స్ (Movie Promotions) కి హాజరు కాదు. దీనికి తోడు ఇప్పుడు కొన్ని కొత్త నిబంధనలు చేరనున్నాయి. దీంతో నయన్ కండీషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. 

Read More: మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ : నయన్ & విక్కీ (Nayanthara & Vignesh Shivan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!