Movie Review : యాక్షన్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘చెప్పాలని ఉంది’ సినిమా

Updated on Dec 09, 2022 05:19 PM IST
కొత్త హీరోహీరోయిన్లతో దర్శకుడు అరుణ్‌ భారతి ఎల్‌ తెరకెక్కించిన చెప్పాలని ఉంది సినిమా శుక్రవారం విడుదలైంది
కొత్త హీరోహీరోయిన్లతో దర్శకుడు అరుణ్‌ భారతి ఎల్‌ తెరకెక్కించిన చెప్పాలని ఉంది సినిమా శుక్రవారం విడుదలైంది

టైటిల్ : చెప్పాలని ఉంది

నటీనటులు : యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య, పృధ్వి, మురళీ శర్మ, సునీల్

బ్యానర్ : సూపర్ గుడ్ ఫిలింస్‌

నిర్మాతలు:  వాకాడ  అంజన్ కుమార్, యోగేష్ కుమార్

సంగీతం : అస్లాం కీ

దర్శకత్వం:  అరుణ్ భారతి ఎల్

రేటింగ్ : 3/5

కొత్త నటీనటులు యష్‌ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చెప్పాలని ఉంది సినిమాకు ఎల్.అరుణ్‌ భారతి దర్శకత్వం వహించారు. డిసెంబర్‌‌ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 కథ ఏంటంటే :

చంద్ర శేఖర్  (యష్ పూరి) అప్పుల్లో ఉన్న ఇంటిని విడిపించుకోవడానికి ర్యాపిడో డ్రైవర్ గా, ఒక న్యూస్ ఛానల్‌లో రిపోర్టర్‌‌గా పని చేస్తుంటాడు. ర్యాపిడో డ్రైవ్ చేస్తున్న టైమ్ లో వెన్నెల(స్టెఫీ పటేల్) తో పరిచయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ దగ్గర అడుక్కునే పిల్లలకు డబ్బులు ఇవ్వకుండా ఫుడ్ పెట్టమని చెపుతున్న చందు మాటలకు ఇన్‌స్పైర్ అవుతుంది వెన్నెల. దీంతో చందును ఇష్టపడుతుంది.  

ఛానల్ లో  చురుకుగా పనిచేస్తూ తన బాస్ పృధ్వీ వద్ద మంచి పేరు తెచ్చుకుంటారు. ఛానల్ మీటింగ్‌లో టీఆర్‌‌పీ రేటింగ్స్ గురించి ప్రజలకు ఉపయోగం లేని న్యూస్ కవర్  చేసే దానికంటే ఎంతో మందికి హెల్ప్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ సత్య మూర్తి(మురళీ శర్మ) వంటి మంచి వారిని ఇంటర్వ్యూ చేస్తే  చానల్‌కు మంచి పేరు వస్తుందని చెప్తాడు. దానికి అంగీకరించిన పృధ్వీ ఆ ఇంటర్వ్యూ బాధ్యతను చందుకు అప్పగిస్తారు. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని సత్య మూర్తిని ఇంప్రెస్స్ చేసి ఇంటర్వ్యూ కు ఒప్పిస్తాడు.

ఇంటర్వ్యూ చేసే రోజు  జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో చందు తలకు గాయం అవుతుంది. అయితే ఎంతో కష్టపడి సత్య మూర్తి ని ఇంటర్వ్యూ చేసే టైమ్ లో  చందు అందరినీ గుర్తుపడుతున్నా తను మాట్లాడే భాష  మరిచిపోయి వేరే భాష మాట్లాడతాడు.ఆ బాష  అర్ధంకాక  ఇంటర్వ్యూ కు వచ్చిన సత్య మూర్తి వెళ్లిపోతాడు. తరువాత డాక్టర్ రాజీవ్ కనకాల చెకప్ చేసి తను ఏ భాష మాట్లాడుతున్నాడో అర్థం కాక ప్రపంచంలోని అన్ని భాషలతో మ్యాచ్ చేయాలని చూసినా ఏ బాష  మ్యాచ్ కాదు. తెలియని భాష కారణంగా చందు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు మామూలు మనిషి అవుతాడా? దానికి చందు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది సినిమా కథ. 

 

ఎవరెలా నటించారంటే ?

యష్ పూరి కొత్తవాడైనా చక్కటి ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్‌, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ లతో చక్కటి నటనను కనబరిచాడు.యాక్షన్ సీన్స్ ని చాలా ఈజ్ తో చేశాడు. అనుభవం ఉన్న నటుడిలా చంద్ర శేఖర్ పాత్రలో ఒదిగి పోయాడు. వెన్నెల పాత్రలో నటించిన (స్టెఫీ పటేల్) మధ్య తరగతి  యువతిగా అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది.

ప్రేమ, భావోద్వేగాల సన్నివేశాలలో యూత్ ను ఆకట్టుకుంది. చందు, వెన్నెల మధ్య ప్రేమ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. చందు ఫ్రెండ్ గా సత్య, సుపీరియర్ గా  పృథ్వి డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. బిజినెస్ మ్యాన్ గా మురళీ శర్మ నటన నేచురల్‌గా ఉంటుంది.  డాక్టర్ గా రాజీవ్ కనకాల, హీరోయిన్ వెన్నెల తండ్రిగా నటించిన తనికెళ్ల భరణి భావోద్వేగమైన డైలాగ్స్ తో ఆకట్టుకుంటారు.విలన్‌గా రఘుబాబు, అలీ,  సత్యం రాజేష్, నంద కిషోర్ , అనంత్  వారి పాత్రలకు న్యాయం చేశారు.

ఎలా ఉందంటే..

'ఇతర భాషలను గౌరవిద్దాం.. మాతృభాషను ప్రేమిద్దాం' అని ఇంటర్నల్‌గా మెసేజ్‌ ఇస్తూనే కంటెంట్ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్నారు దర్శకుడు అరుణ్‌ భారతి. ఈ కథకు కామెడీ, డ్రామా, రొమాన్స్, యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్ : కథ నడిపించిన తీరు

మైనస్ పాయింట్స్ : నటీనటులు కొత్త వారు కావడం

ఒక్క మాటలో.. ‘చెప్పాలని ఉంది’ కానీ సరిగ్గా చెప్పలేదు

Read More : Tollywood : వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా సత్తాచాటుతున్న టాలీవుడ్ స్టార్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!