NTR 30: ఎన్టీఆర్ 30 కోసం అనిరుధ్‌ను ఫిక్స్ చేసిన కొరటాల శివ

Updated on Nov 20, 2022 07:23 PM IST
దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్‌ను ఫిక్స్ చేశారు.
దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్‌ను ఫిక్స్ చేశారు.

NTR 30 : టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ (NTR) ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా తన ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్ 30 చిత్రం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్‌ను ఫిక్స్ చేశారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్‌ను ఎన్టీఆర్ 30 సినిమా కోసం సెలెక్ట్ చేశారు.  జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అనిరుధ్‌‌ను ఎంచుకున్నారు. 

ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా మ్యూజిక్ గురించి కొరటాల శివతో చర్చించే ఫోటోలను అనిరుధ్‌ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనిరుధ్ మాస్ పాటలకు ఎన్టీఆర్ డాన్సులు అదిరిపోతాయంటూ ఎన్టీఆర్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.   అజ్ఞాతవాసి సినిమాతో అనిరుధ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. యూ టర్న్, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. 

Read More: Tollywood: టాలీవుడ్‌లో సొంత జెట్ విమానాలు ఉన్న హీరోలు ఎవరో మీకు తెలుసా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!