RC15 Update: 'ఆర్సీ15' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. దుబాయ్‌లో మెగా ఈవెంట్, ఒకే వేదికపై పవన్ కల్యాణ్, యష్ (Yash)

Updated on Aug 10, 2022 02:35 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ‘కేజీఎఫ్’ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ (Hero Yash) ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ‘కేజీఎఫ్’ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ (Hero Yash) ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సంచలన దర్శకుడు శంకర్ (Director Shanakr) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'ఆర్సీ15' (RC15). బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

రామ్ చరణ్ కెరీర్‌లో  15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ  చిత్రం, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ నిర్మాణంలో రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా కావడం విశేషం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ క్రమంలో 'ఆర్సీ15' సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ (RC15 First Look) కోసం యావత్  తెలుగు సినీ పరిశ్రమ ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.  

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి మూడు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో పాటు, ఒక మోషన్ పోస్టర్‌ని దుబాయ్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మెగా ఈవెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ‘కేజీఎఫ్’ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ (Hero Yash) ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

'ఆర్సీ15' (RC15) సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని టాక్. అలాగే  సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం (SS Thaman) అందిస్తున్నారు. ఇక, ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే.. 'విశ్వంభర', 'సర్కారోడు' అనే పేర్లు బాగా వినిపిస్తున్నాయి..! 

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన  "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్.. ఆ తరువాత  "ఆచార్య" సినిమా‌తో అంతే పెద్ద డిజాస్టర్ అందుకున్నారు. 

Read More: Ramcharan-Director Shankar: రామ్ చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. త్వరలో అధికారిక ప్రకటన!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!