క్రేజీ కాంబినేషన్ : RC 15 తర్వాత.. శంకర్ (Shankar) తో సినిమా చేసే టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరు ?

Updated on Jun 08, 2022 08:32 PM IST
డైరెక్టర్ శంకర్, ఎన్టీఆర్ (NTR, Director Shankar)
డైరెక్టర్ శంకర్, ఎన్టీఆర్ (NTR, Director Shankar)

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద సినిమా చేసినా.. తమిళ హీరోలే ఆయనకు తొలి ప్రాధాన్యం. టెక్నాలజీ, సామాజిక అంశాలపై తనదైన స్టైల్లో సినిమాలు తీస్తూ,  ప్రేక్షకులను మెప్పించడంలో శంకర్ దిట్ట.

దక్షిణాది సినీ పరిశ్రమను పాన్ ఇండియాకు పరిచయం చేసింది కూడా శంకర్ సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో ఆయన చేసిన జీన్స్, ప్రేమికుడు, భారతీయుడు, జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, శివాజీ, ఐ సినిమాలు ఎంతటి ఘన విజయాలు సాధించాయో అందరికీ తెలిసిన విషయమే.

అయితే, శంకర్ తెలుగులో ఇప్పటివరకు నేరుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు ఉన్న క్రేజ్ మాములుగా లేదు. 

ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న ఈ స్టార్ డైరెక్టర్.. ఎన్టీఆర్ (NTR) తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడట. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ..  మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌‌తో తొలిసారి తెలుగులో పాన్ ఇండియా మూవీ  చేస్తున్నారు.  చెర్రీ కెరీర్ లో ఇది 15వ సినిమాగా తెరకెక్కుతోంది. అలాగే దిల్ రాజు  ప్రొడక్షన్స్‌లో 50 వ సినిమాగా రూపొందుతుంది.

అలాగే, ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. తండ్రి చిరంజీవితో కలిసి రామ్ చరణ్ చేసిన ఆచార్య సినిమా ప్లాప్ కావడంతో.. శంకర్ సినిమా అంతకుమించి హిట్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. 

టైటిల్ పై కసరత్తు

ఇక, ఈ సినిమాకి సంబంధించి ఇదివరకు విశ్వంభర, సర్కారోడు అనే టైటిల్స్ ప్రచారంలోకి రాగా.. ప్రస్తుతం అధికారి అనే మరో టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారా కూడా శంకర్ (Director Shankar) ఓ కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నారు.

కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్ ఎన్నికల కమీషనర్‌గా, ఐఏఎస్ అధికారిగా కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే అతడి పాత్ర ఏంటనేది ఇప్పటివరకూ అధికారికంగా తెలియలేదు. అలాగే, ఇందులో చరణ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

వైజాగ్ పరిసరాలలో శంకర్ సినిమా షూటింగ్

రామ్‌ చరణ్‌తో (Ram Charan) శంకర్‌ తెరకెక్కించే సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసరాల్లో జరుగుతోంది. అక్కడే చరణ్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి  ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

చరణ్ మూవీ తర్వాత కమల్ హాసన్‌తో భారతీయుడు 2 షూట్ కంప్లీట్ చేయనున్నాడు శంకర్. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు శంకర్, ఇటు ఎన్టీఆర్‌ కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ క్రేజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. 

దిల్ రాజుతోనే ఆ సినిమా కూడా..

రామ్ చరణ్‌తో తీస్తున్న సినిమా కథ డిస్కషన్ సమయంలోనే, దిల్ రాజుకు శంకర్ మరో అదిరిపోయే కథ వినిపించాడట. అది దిల్ రాజుకు బాగా నచ్చిందని, ఆ కథతోనే ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం అంటే ఎన్టీఆర్ నో చెప్పే అవకాశమే లేదు. అందుకే ఈ కాంబో ఖచ్చితంగా సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Read More: Sharwanand : శర్వానంద్ సరసన రాశీఖన్నా.. టాలీవుడ్‌లో సరికొత్త కాంబినేషన్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!