Ramcharan-Director Shankar: రామ్ చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. త్వరలో అధికారిక ప్రకటన!
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఆర్‌సీ 15 (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా..సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తారని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా, విడుదలకు ముందే ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ.150 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందని తెలుస్తోంది.
అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇకపోతే ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్ , అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. అంతకుముందు ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ వినపడ్డాయి. ఇటీవల 'విశ్వంబర' టైటిల్ ని ఓకే చేద్దామనుకున్నారు. కానీ అది బాగా క్లాస్ గా ఉందని ఫీలయ్యారట. అంతేగాక సర్కారోడు, ఆఫీసర్ ఇలా చాలా టైటిల్స్ అనుకున్నారు.
ఇకపోతే తాజా సమాచారం ప్రకారం.... ఫైనల్ గా 'అధికారి' అనే టైటిల్ దగ్గర ఆగినట్లు సమాచారం అందుతోంది. రామ్ చరణ్ (Ram Charan) కూడా ఈ టైటిల్ కే ఓటేసారట. దాంతోపాటు టైటిల్ పవర్ఫుల్ గా ఉండటంతో ప్రచారంలో ఉన్న 'అధికారి' పేరే ఖాయం చేద్దామని శంకర్ అన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ఈ టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని వినికిడి.
కాగా 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ ఎలక్షన్ కమీషనర్ గా నటించనుండగటంతో పాటు, ఓ మాస్ పాత్రతో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాక రామ్ చరణ్ ఆ మధ్యన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి, డైరెక్టర్ శంకర్ (Director Shankar) గురించి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తెర మీద అయిన సినిమాలు చూసి ఇష్టపడతాం. ఇక ఇప్పుడు ఆయనతోనే కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.