మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 'గాడ్ ఫాదర్' (God Father) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ గైర్హాజరు?

Updated on Sep 23, 2022 06:36 PM IST
'గాడ్ ఫాదర్' సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ (God Father Pre Release Event) విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
'గాడ్ ఫాదర్' సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ (God Father Pre Release Event) విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' (God Father) అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. 

అయితే 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (God Father Pre Release Event) చీఫ్‌ గెస్ట్‌గా పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అయితే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని భావించిన మేకర్స్‌.. ఈవెంట్‌కు రావాలని పవన్‌ను ఆహ్వానించాలని అనుకున్నారట. కానీ తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం 'గాడ్ ఫాదర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోవడం లేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అక్టోబర్ రెండో వారంలో గానీ ఆయన అమెరికా నుండి ఇండియాకు వచ్చే పరిస్థితి లేదంటూ జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు.

God Father Movie Poster

ఇదిలా ఉంటే.. దసరా సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 'గాడ్ ఫాదర్' సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ (God Father Pre Release Event) విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో రెండు ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ చేయించాలని, దీంతోపాటు దుబాయ్‌లో కూడా ఓ ఈవెంట్‌ జరిపించాలని చిరు సన్నాహాలు చేస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. 

ఇక, చిరంజీవి (Megastar Chiranjeevi) తర్వాతి సినిమాల విషయానికి వస్తే.. తన నెక్స్ట్ ప్రాజెక్టును యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తో చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. అలాగే చిరంజీవి మెహర్ రమేష్ తో 'భోళా శంకర్' (Bhola Shankar) అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ యంగ్ లుక్ లో సూపర్ అనిపించారు.

Read More: God Father : 'గాడ్ ఫాదర్' చిత్రంలో చిరంజీవి పలికిన ఆసక్తికరమైన పొలిటికల్ డైలాగ్ ఇదే.. వైరల్ అవుతున్న వీడియో !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!