పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాజా సినిమా ట్రైలర్ లాంఛ్..!

Published on Sep 09, 2022 02:49 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మొదటి నుంచీ కథల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' (Nenu Meeku Baaga Kavalsinavaadini). 

లెజెండరీ డైరెక్టర్ కోడి రామ‌కృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా  ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'SR కల్యాణమండపం' డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.

'SR కళ్యాణమండపం' (SR Kalyanamandapam) లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'రాజావారి రాణిగారు', 'SR క‌ళ్యాణ‌మండ‌పం' లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు.

'నేను మీకు బాగా కావాల్సినవాడిని' (Nenu Meeku Baaga Kavalsinavaadini) సినిమా నుంచి ఇటీవలే విడుదలైన "నచ్చావ్ అబ్బాయి" పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా రూపొందుతోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) మాస్ లుక్‌లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిద్ధార్థ్ మీన‌న్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహారిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు నటిస్తున్నారు.

'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16వ తేదిన విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన కిరణ్ అబ్బవరం 'ఫ్యాన్ బాయ్ మూమెంట్' అంటూ కామెంట్ చేశారు. ఇక, మాస్ అంశాలతో ఈ సినిమా ట్రైలర్ (Nenu Meeku Baaga Kavalsinavaadini Trailer) ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

Read More: కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) హీరోగా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”.. మాస్ బీట్ సాంగ్ రిలీజ్..!