సినీ ప్రయాణంలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఎమోషనల్ పోస్ట్!

Updated on Sep 23, 2022 03:46 PM IST
తన జీవితంలోని ఓ కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).
తన జీవితంలోని ఓ కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఈ పేరు మారుమోగుతూనే ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తన ప్రతిభతో, స్వయంకృషితో తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నేటితో తన సినీ ప్రయాణంలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన జీవితంలోని ఓ కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

'మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు.. ఈ రోజు 22సెప్టెంబర్ 1978. 'ప్రాణం ఖరీదు' (Pranam Khareedu) సినిమా ద్వారా ప్రాణం పోసి.. ప్రాణపదంగా, నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరై 44 సంవత్సరాలు నన్న నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. ఎప్పటికీ మీ చిరంజీవి..' అంటూ ఆయన రాసుకొచ్చారు. 

'ప్రాణం ఖరీదు' సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తెలుగు ప్రజల గుండెల్లో మెగాస్టార్‏గా స్థానం సంపాదించుకోవడమే కాకుండా అన్నయ్యగా యువతకు చేరువయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరో చిరు... ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు. చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని బ్యాగ్రౌండ్ లేకుండా.. టాలెంట్‏తో పరిశ్రమలో అడుగుపెట్టి నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారు అనేకం ఉన్నారు. 

ఇదిలా ఉంటే.. చిరంజీవి (Megastar Chiranjeevi) తన సినీ జీవితం పై చేసిన ఈ పోస్ట్ కి భారీగా లైక్స్ వస్తున్నాయి. ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. ఆయన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది.

Read More: 44 Years to Pranam Khareedu : చరిత్రను తిరగాసిన చిరంజీవి 'ప్రాణం ఖరీదు' చిత్రం.. టాప్ 10 విశేషాలు ఇవే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!