టీవీ ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసిన మహేష్‌బాబు (MaheshBabu) భార్య నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar)

Updated on Aug 19, 2022 10:59 PM IST
ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్‌బాబు (MaheshBabu) భార్య  నమ్రతా శిరోద్కర్ ఇప్పుడు బుల్లితెరపై మంచి కంటెంట్‌ను అందించడానికి రెడీ అవుతున్నారు.
ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్‌బాబు (MaheshBabu) భార్య నమ్రతా శిరోద్కర్ ఇప్పుడు బుల్లితెరపై మంచి కంటెంట్‌ను అందించడానికి రెడీ అవుతున్నారు.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) భార్యగా నమ్రతా శిరోద్కర్‌ (Namratha Sirodkar) అందరికీ పరిచయమే. అయితే మహేష్‌ హీరోగా ఎంత బిజీగా ఉంటారో ఆమె కూడా ఎప్పుడూ అదే విధంగా బిజీగానే ఉంటారు. ఇల్లు, పిల్లలు, వాళ్ల చదువులు, మహేష్‌ సినిమాలకు సంబంధించిన పనులతో  అనుక్షణం బిజీగానే ఉంటారు నమ్రత. ఇంత బిజీగా ఉంటూ కూడా ప్రస్తుతం ఆమె వినూత్న ప్రయత్నం చేయనున్నారు.

టీవీ రంగంలోకి అడుగుపెట్టి కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు నమ్రత. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి, ఆమె ఆడపడుచు మంజుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్‌బాబు (MaheshBabu) భార్య  నమ్రతా శిరోద్కర్ ఇప్పుడు బుల్లితెరపై మంచి కంటెంట్‌ను అందించడానికి రెడీ అవుతున్నారు.

ఎప్పుడూ ప్లాన్ చేసుకోలే..

‘నాకున్న పరిధిలోనే సినిమాల్లో నటించాను. జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేనెప్పుడు ప్లాన్‌ చేసుకోలేదు. పెద్దగా కలలు కూడా కనలేదు. జీవితం ఎలా నడిపిస్తే అలా సాగానంతే. నిజం చెప్పాలంటే నేను ఎయిర్‌  హోస్టెస్‌ కావాలని అనుకున్నాను. ప్రమాదాలు జరుగుతాయని అమ్మ భయపడింది. అందుకే ఆ ఫీల్డ్‌ వైపు వెళ్లలేదు. సినిమాలకు దూరం కావడం వల్ల కూడా నాకు బాధ లేదు. అంత కన్నా అందమైన ఫ్యామిలీ బాధ్యత మోస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

ప్రస్తుతం యాక్టింగ్‌ చేసే ఆలోచన లేదు. నాకు ఖాళీగా కూర్చుంటే బోర్‌ కొడుతుంది. అందుకే ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటా. టీవీ రంగానికి సంబంధించి ప్రొడ్యూసింగ్‌ కంపెనీ స్టార్ట్‌ చేశా. దాని నుంచి మంచి కంటెంట్‌ ప్రేక్షకులకు అందించాలనుంది. ఆ పనుల్లో బిజీగా ఉన్నా. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కాబట్టి  కాస్త తీరిక దొరికింది’ అని తెలిపారు నమ్రత. 

మంజుల బెస్ట్‌ ఫ్రెండ్‌..

ఓ పార్టీలో అనుకోకుండా మంజులను (మహేష్‌బాబు అక్క) కలిశాను. అప్పటికి నేను మహేష్‌ (MaheshBabu) లవ్‌లో ఉన్నట్టు తెలీదు. ఆ తర్వాత ఇద్దరం ఒక ఇంటివాళ్లయ్యాం. అంతేకాదు మేమిద్దం ఒకేసారి ప్రెగ్నెంట్స్‌ అయ్యాం. అది కో ఇన్సిడెంటల్‌గానే జరిగింది అని చెప్పారు నమ్రతా శిరోద్కర్ (Namratha Sirodkar).

Read Moire : Mahesh Babu Top Ten Movies: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు టాప్‌ 10 సినిమాలు.. ప్రత్యేకంగా మీకోసం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!