సూపర్ స్టార్ మహేష్ బాబు 'SSMB 28' షూటింగ్ షురూ.. త్రివిక్రమ్ సినిమాలో అదిరిపోయే లుక్‌తో ప్రిన్స్.. ఫొటో వైరల్

Updated on Sep 12, 2022 06:17 PM IST
ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది.
ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  కాంబోలో వస్తున్న తాజా సినిమా 'SSMB 28' (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరో కథానాయికగా శ్రీలీల నటించబోతున్నట్టు సమాచారం. ఇందులో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. 

కాగా, ఈ సినిమాను త్రివిక్రమ్ (Trivikram Srinivas) పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇక అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు.. ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ప్రారంభమైన షెడ్యూల్‌ 25 రోజుల పాటు సాగే అవకాశం ఉందని సమాచారం. యాక్షన్ సీన్స్‌తో పాటు.. పాట‌లు కూడా చిత్రీకరించేందుకు మాటల మాంత్రికుడు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ తన లుక్‌ను పూర్తిగా ఛేంజ్ చేసుకున్నారు. షూటింగ్‌ సెట్స్‌లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ మాట్లాడుతున్న పిక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ ఫొటోను చూస్తే.. సీన్ వివరిస్తున్నట్లు ఉంది. 

మరోవైపు.. తాజాగా మహేష్ బాబు ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మధ్య మహేష్ బాబు తాను చేయబోతున్న త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారిపోయిన విషయం తెలిసిందే. ఈ లుక్‌లోనే మరో ఫోటోను మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ షేర్ చేసింది. ఇందులో ఆయన చాలా యంగ్ లుక్‌లో గడ్డం తో పాటు కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపిస్తూ మరింత ఆకర్షిస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!