మ‌రో ఘ‌న‌త సాధించిన ఆర్.ఆర్.ఆర్ (RRR)!.. హాలీవుడ్ అవార్డు నామినేష‌న్‌కు ఎంపికైన మొద‌టి ఇండియ‌న్ సినిమా

Updated on Jun 29, 2022 07:19 PM IST
RRR: హాలీవుడ్ లెవెల్‌లో నామినేష‌న్ వ‌ర‌కు వెళ్లిన మొద‌టి ఇండియ‌న్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ రికార్డు సాధించింది.
RRR: హాలీవుడ్ లెవెల్‌లో నామినేష‌న్ వ‌ర‌కు వెళ్లిన మొద‌టి ఇండియ‌న్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ రికార్డు సాధించింది.

టాలీవుడ్‌లో ఆర్.ఆర్.ఆర్.(RRR) సినిమా ఇండియ‌న్ రికార్డుల‌ను తిర‌గ రాసింది. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల పోరాటాన్ని రౌద్రం రణం రుధిరం టైటిల్‌తో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించారు. వ‌సూళ్ల ప‌రంగా ఎన్నో రికార్డులు సాధించిన ఈ సినిమాకు మ‌రో గౌర‌వం ద‌క్కింది. హాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డుకు నామినేష‌న్ పొందింది.

రాజ‌మౌళి సృష్టించిన ఆర్.ఆర్.ఆర్ ప‌లు రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. హాలీవుడ్ లెవెల్‌లో నామినేష‌న్ వ‌ర‌కు వెళ్లిన మొద‌టి ఇండియ‌న్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ రికార్డు సాధించింది. 

అల్లూరి సీతారామ‌రాజును పోలిన విప్లవ యోధుడి పాత్రలో రామ్ చ‌ర‌ణ్, కొమురం భీమ్‌ని పోలిన సాయుధవీరుడి పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్'కు ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్.ఆర్.ఆర్(RRR) నామినేషన్ సాధించింది. 

 

RRR: హాలీవుడ్ లెవెల్‌లో నామినేష‌న్ వ‌ర‌కు వెళ్లిన మొద‌టి ఇండియ‌న్ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ రికార్డు సాధించింది.

ఆర్.ఆర్.ఆర్‌.కు మ‌రో రికార్డు
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుల‌లో ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్.ఆర్.ఆర్ (RRR) నామినేషన్ పొందింది. ఈ చిత్రం సోష‌ల్ మీడియా విభాగం ఈ విష‌యాన్ని తెలిపింది. ఉత్తమ సినిమా కేటగిరీలో ఆర్.ఆర్.ఆర్. నామినేషన్ పొందడం సంతోషంగా ఉందని తెలిపింది. 

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ సినిమా కూడా పోటీ ప‌డ‌లేదు. ఆర్.ఆర్.ఆర్ ఉత్త‌మ చిత్రం కేట‌గిరిలో మ‌రో 9 హాలీవుడ్ చిత్రాల‌తో పోటీప‌డుతుంది. ఉత్త‌మ చిత్రంగా ఆర్.ఆర్.ఆర్. సినిమానే విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంతో ఉంది. 

క‌లెక్ష‌న్ల మోత మోగించిన ఆర్.ఆర్.ఆర్ (RRR). 
2022 మార్చి 25న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేశారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మించారు. రాజ‌మౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ క‌థ‌ను అందించారు. 

ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రూ. 550 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. బాహుబ‌లి 2 త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రాజ‌మౌళి ఇండియ‌న్ సినిమా రికార్డులను మ‌రోసారి తిర‌గ‌రాశారు. ఈ సినిమా దాదాపు రూ. 1200 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. హిందీలో ఆర్.ఆర్.ఆర్‌. రూ. 274.31 కోట్ల‌ను రాబ‌ట్టింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. 

Read More: RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!