‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమా డైరెక్టర్ రాజమౌళిని (Rajamouli) పొగడ్తలతో ముంచెత్తిన హాలీవుడ్‌ నటుడు

Updated on May 27, 2022 05:41 PM IST
హాలీవుడ్ నటుడు ప్యాటన్ ఆస్వాల్ట్‌
హాలీవుడ్ నటుడు ప్యాటన్ ఆస్వాల్ట్‌

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌.. పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజై అందరి మన్ననలు పొందింది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. థియేటర్లలో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌.. ఇటీవల ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయ్యింది. ఓటీటీలో కూడా భారీ సంఖ్యలో వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డులను తిరగరాస్తోంది.

అయితే ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాను హాలీవుడ్ నటుడు ప్యాటన్ ఆస్వాల్ట్‌ చూశారు. ఆ సినిమా తనకు విపరీతంగా నచ్చేసిందట. దీంతో సినిమాపై కామెంట్లు చేస్తూ వరుసగా ట్వీట్లు చేశాడు పాటన్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరాడు.  

బాలీవుడ్‌ నటుడు ప్యాటన్ ఆస్వాల్ట్‌  చేసిన ట్వీట్

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ అద్భుతమైన సినిమా. ఈ సినిమాను మీ దగ్గరలోని థియేటర్లలో తప్పకుండా చూడండి. లేకుంటే ఇప్పుడు ఓటీటీలో కూడా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా అందుబాటులో ఉంది. అందులోనైనా చూడండి. రాజమౌళి.. మీ ఆలోచన, సినిమా తీసిన విధానం, కథ చెప్పిన తీరు అద్భుతం. మీరు ఇటువంటి సినిమాలు తీస్తుంటే మిగిలిన వాళ్లు ఏమైపోతారు. సినిమాలు చేయడానికి మిమ్మల్ని అనుమతించకూడదు. మీరు తర్వాత చేయబోయే సినిమాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్‌లో ప్యాటన్ పేర్కొన్నాడు.

ఇక, మన తెలుగు సినిమాకి హాలీవుడ్‌ నటీనటుల నుంచి కూడా ప్రశంసలు వస్తుండడంతో సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాంచరణ్‌, -తారక్‌ హీరోలుగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ.1200 కోట్లు వసూలు చేసింది

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!