Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త ఆలోచనలు.. 'మహానటి' హిట్ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలకే తొలి ప్రాధాన్యం !

Updated on Jun 21, 2022 10:47 PM IST
కీర్తి సురేష్ (Keerthy Suresh)
కీర్తి సురేష్ (Keerthy Suresh)

టాలీవుడ్ ఇండష్ట్రీలో 'మహానటి' కీర్తి సురేష్ (Keerthy Suresh) గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్న ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే, ఆ తర్వాత నుంచి కీర్తి ఎంచుకునే పాత్రల కారణంగా, ఆమె కెరీర్ గాడి తప్పింది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. 

ఏ ముహూర్తాన 'మహానటి' సినిమా చేసిందో కానీ, అమ్మడికి అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మంచి విజయం కూడా దక్కలేదు. అన్నీ వరుసగా ప్లాపులే. అయితే ఇటీవలే 'సర్కారు వారి పాట' చిత్రంతో కీర్తి ఊహించని విజయాన్ని అందుకున్నా.. అది మహేష్ బాబు (Mahesh Babu) లెక్కలోకి వెళ్లిపోవడంతో, ఆమె ఆశ అడియాసే అయ్యింది. 

'మహానటి' సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక.. ఎందుకో కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ సినిమాలనే ఎంచుకుంటూ.. వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొంది. ‘పెంగ్విన్, గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా’ వంటి సినిమాలు ఆమెకు ఆశించినంత విజయాన్ని అయితే ఇవ్వలేదు. అయినా కూడా, ఈ అమ్మడు వరుసగా అవే తరహా సినిమాలను ఎంచుకుంది. 

ఇక ఇటీవలే విడుదలైన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) లో కళావతి పాత్రలో కీర్తి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్ 'సర్కారు వారి పాట సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉందని పేర్కొంటూ.. ఈ సినిమా తర్వాత తనకు మరిన్ని కమర్షియల్ సినిమాలు వస్తున్నాయని' చెప్పింది. అయితే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ముందుకెళ్లడం తనకి చాలా ఇష్టమని.. అలాంటి కథలు వస్తే తప్పకుండా నటిస్తానంటూ, తన మనసులోని మాటని బయటపెట్టింది కీర్తి సురేష్. 

ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టింది. అయితే ఇవి పూర్తయ్యే లోపు లేడీ ఓరియెంటెడ్ (Lady Oriented Movies) కథలు వస్తే, 'టక్కున' ఓకే చెప్తానని ఈ బ్యూటీ స్వయంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.

దీంతో ఒక్కసారి దెబ్బ తిన్నాక కూడా, మళ్లీ ఈ ప్రయోగాలు అవసరమా.. అంటూ టాలీవుడ్, కోలీవుడ్ అభిమానులు ఈ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. అయినా ఇవేమి తనకు పట్టవని, తాను లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా సై అంటానని కూర్చున్నదట. దీంతో కీర్తి తీసుకున్న నిర్ణయానికి ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

ఇదిలా ఉంటే.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) యోగా ఫోజులతో ఆకట్టుకుంటోంది. కఠినమైన యోగాసనాలు వేస్తూ మతిపోగొడుతోంది. యోగాపై అందరికీ ఆసక్తి పెరిగేలా చేస్తోంది.

కీర్తి సురేష్.. సూర్య రష్మి ఇంట్లో పడే ప్రదేశంలో యోగా మ్యాట్ పై ఆసనాలు వేసింది. శరీరంలోని ప్రతి భాగం కదిలేలా.. ప్రతి అవయవాన్ని యాక్టివేట్ చేసేలా యోగాసనాలు వేసింది. పదికి పైగా ఫోజులతో కీర్తి యోగాపై తన అభిమానులందరికీ ఆసక్తిని పెంచుతోంది.

 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోనూ షేర్ చేసిన కీర్తి.. ఆడియెన్స్‌తో పాటు, తన అభిమానులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపింది. 

Read More: Keerthy Suresh: మైండ్ బ్లాంక్ అయింది.. అందుకే మ‌హాన‌టి త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌లేదు : కీర్తి సురేష్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!