Keerthy Suresh: కీర్తి సురేష్‌ను అంద‌రూ ఆ పేరుతోనే పిలుస్తున్నార‌ట‌!

Updated on May 24, 2022 10:24 AM IST
Keerthy Suresh: మ‌హాన‌టి అని పిలిచే వారు ఇప్పుడు క‌ళావ‌తి అని కీర్తి సురేష్‌ను పిలుస్తున్నారట‌.
Keerthy Suresh: మ‌హాన‌టి అని పిలిచే వారు ఇప్పుడు క‌ళావ‌తి అని కీర్తి సురేష్‌ను పిలుస్తున్నారట‌.

Keerthy Suresh: స‌ర్కారు వారి పాట సినిమాతో మ‌రింత పాపుల‌ర్ అయ్యారు కీర్తి సురేష్. క‌ళావ‌తి.. క‌ళావ‌తి అంటూ సాగే పాట‌లో అదిరగొట్టారు. క‌ళావతి క్యారెక్ట‌ర్ కీర్తి సురేష్‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో కీర్తి సురేష్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింది. 

మ‌హాన‌టి సినిమాతో త‌న న‌ట విశ్వ‌రూపం చూపారు కీర్తి సురేష్. మ‌హాన‌టి సావిత్రిగా చేసిన న‌ట‌న‌కు నేష‌న‌ల్ అవార్డు పొందారు కీర్తి.. మ‌హాన‌టిగా కీర్తి సురేష్ పాపుల‌ర్ అయ్యారు. ఆ సినిమా త‌ర్వాత కీర్తి సురేష్ రేంజ్ మరింత పెరిగింది. కానీ కీర్తి సురేష్ మ‌హాన‌టి మూవీ త‌ర్వాత న‌టించిన చిత్రాలు అంత పెద్ద హిట్ సాధించ‌లేదు.  

 

Keerthy Suresh: మ‌హాన‌టి అని పిలిచే వారు ఇప్పుడు క‌ళావ‌తి అని కీర్తి సురేష్‌ను పిలుస్తున్నారట‌.

స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata)లో మ‌హేష్ బాబుకు జోడిగా క‌ళావ‌తి క్యారెక్ట‌ర్‌తో కీర్తి న‌టించారు. మ‌హేష్, కీర్తీల మ‌ధ్య కెమిస్ట్రీ బాగుందంటూ ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు. క‌ళావ‌తిగా కీర్తి ఇమేజ్ ఇంకా పెరిగింది. మ‌హాన‌టి అని పిలిచే వారు ఇప్పుడు క‌ళావ‌తి అని కీర్తి సురేష్‌ను పిలుస్తున్నారట‌.  క‌ళావ‌తి క్యారెక్ట‌ర్ పేరుతో సినిమాలో పాట కూడా ఉండ‌టం చాలా సంతోషంగా అనిపించింద‌ని కీర్తి చెప్పారు. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ హీరో నానితో క‌లిసి ద‌స‌రా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ క్యారెక్ట‌ర్‌లో కీర్తి సురేష్ క‌నిపించ‌నున్నార‌ట‌. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!