Megastar Chiranjeevi: 'మెగాస్టార్ చిరంజీవి' పేరు మార్చుకున్నాడా? లేక గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ లో జరిగిన పొరపాటా?

Updated on Jul 05, 2022 09:04 PM IST
చిరంజీవి పోస్టర్ (Chiranjeevi Poster)
చిరంజీవి పోస్టర్ (Chiranjeevi Poster)

Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతితలో గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) చిత్రాలు ఉన్నాయి. అంతకంటే ముందు చిరు నటించిన ‘ఆచార్య’ (Acharya) చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి విడుదలయింది.

‘సైరా’ (Saira) తర్వాత చిరు నటించిన సినిమా ఇదే కావడం, ఇప్పటివరకూ ఫ్లాప్ అన్నదే లేకుండా దర్శకుడిగా దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వం వహించడం.. ఇవన్నీ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అయితే సినిమా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టరైంది. బయ్యర్స్ కు దాదాపు రూ. 70 కోట్ల నష్టం వచ్చింది. 

కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం, మరో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) నటించడం.. కథానాయికగా పూజా హెగ్డే (Pooja Hegde) ఎంపిక.. ఇవన్నీ సినిమాకి అదనపు బలంగా మారతాయని ప్రేక్షకులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే విడుదలకు ముందు సినిమాకి మంచి హైపు క్రియేట్ అయింది. సినిమా కోసం ప్రత్యేకించి భారీ టెంపుల్ సెట్ కూడా క్రియేట్ చేశారు. అయితే, ఇవేవీ ఆ సినిమాకు కలిసిరాలేదు. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన హీరోగా నటించిన గాడ్ ఫాదర్ (God Father) మూవీ టీజర్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అవ్వగా.. అందులో చిరంజీవి పేరులో చిన్న మార్పు కనిపించింది. ఆయన పేరు స్పెల్లింగ్ Megastar Chiranjeevi కాగా.. ఒక 'E'ని యాడ్ చేసి.. Megastar Chiranjeeevi అని స్క్రీన్‌పై వచ్చింది. 

అయతే, చిరంజీవి తన పేరులో మరో E ని అదనంగా చేర్చడం ఇప్పుడు టాలీవుడ్ లో (Tollywood) చర్చాంశనీయంగా మారింది. న్యూమరాలజీ ప్రకారమే చిరంజీవి తన పేరులోని స్పెల్లింగ్ ను అలా మార్చుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలోనే చిరంజీవి పేరులో చిన్న మార్పు చేశారని తెలుస్తోంది. కాగా, గతంలో చాలా మంది నటీనటులు, హీరో, హీరోయిన్స్ తమ పేర్లలో స్పెల్లింగ్‌లను మార్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. ఈ విషయంలో ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి (Megastar Chiranjeevi) తన పేరులో మార్పు చేసుకోలేదని.. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పొరపాటు జరిగిందని ఆయన సన్నిహితులు, సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పినట్టు సమాచారం. మరి.. ఈ వార్తలపై చిరంజీవి అధికారంగా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.

Read More: God Father First Look: అదిరిపోయిన మెగా స్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్.. అభిమానులకు పునకాలే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!