Chiranjeevi: చిరంజీవి 'గాడ్ ఫాద‌ర్' ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తుందహో.. అసలు సిసలైన మెగా జాతర ఇప్పుడు మొద‌లైంది !

Updated on Jul 02, 2022 03:02 PM IST
చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమాలో సల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు.
చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమాలో సల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు.

టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల‌ుగా స్టార్ డ‌మ్‌ను కొన‌సాగిస్తున్న‌ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ప్ర‌స్తుతం చిరంజీవి న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఈ సినిమా నుండి మొద‌టి పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అలాగే సోష‌ల్ మీడియా వేదిక‌గా 'గాడ్ ఫాద‌ర్' ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. మోహన్‌రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాద‌ర్' చిత్రం  తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను జూలై 4 న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ న్యూస్‌తో మెగా అభిమానుల‌తో పాటు చిరంజీవి కుటుంబ స‌భ్యులు కూడా తెగ సంతోష ప‌డుతున్నారు. 

మ‌ళ‌యాళం సినిమా రీమేక్
చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమాలో సల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు. 'గాడ్‌ఫాద‌ర్' చిత్రం పొలిటిక‌ల్ యాక్ష‌న్ సినిమాగా తెర‌కెక్కుతోంది. మ‌లయాళం సినిమా 'లూసిఫ‌ర్'ను రీమేక్ చేసి, గాడ్ ఫాద‌ర్‌గా తెలుగులో తెరకెక్కించనున్నారు. మ‌లయాళంలో ఇదే చిత్రంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించారు. ద‌ర్శ‌కుడు, న‌టుడు పృథ్విరాజ్ సుకుమార‌న్ 'లూసిఫ‌ర్' సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ 'కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్‌'లో 'గాడ్ ఫాద‌ర్' తెర‌కెక్కుతోంది. ఈ సినిమా పై సినీ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. 'గాడ్ ఫాద‌ర్' చిత్రంలో న‌య‌న‌తార చిరంజీవికి చెల్లెలుగా న‌టించ‌నున్నారు. అలాగే స‌త్య‌దేవ్ ఇదే చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ద‌స‌రాకు ఈ సినిమా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. 

చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమాలో సల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు.

గాడ్ ఫాద‌ర్‌లో స‌ల్మాన్ క్యారెక్ట‌ర్ ఏంటో!
చిరంజీవి, న‌య‌న‌తార న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్' సినిమా షూటింగ్ కూడా వేగంగానే జ‌రుగుతోంది. ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆ విష‌యాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. 

ఇందులో స‌ల్మాన్ ఖాన్ పాత్ర ఎలా ఉంటుందన్న విషయంపై, ఇప్పటికే అభిమానులలో ఆస‌క్తి పెరిగింది. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో స‌ల్మాన్ కాన్ ఓ గ్యాంగ‌స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ల మధ్య ఓ వార్ సీక్వెన్స్ కూడా ఉంటుందట. మరి వీరిద్దరూ ఏ లెవ‌ల్‌లో ఫైట్ చేస్తారో చూడాలి.

ఇక మ‌లయాళ చిత్రం 'లూసిఫ‌ర్‌'లో  ద‌ర్శ‌కుడు, న‌టుడు పృథ్విరాజ్ సుకుమార‌న్ ఓ ప్రత్యేక పాత్రలో న‌టించారు. అదే పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ పోషిస్తారని టాక్. 'లూసిఫర్' చిత్రంలో మోహ‌న్ లాల్ మారువేషంలో రష్యా వెళ్లి పృథ్విరాజ్‌ను కలుస్తారు. ఇక 'గాడ్ ఫాద‌ర్‌'గా చిరంజీవి స‌ల్మాన్ ఖాన్ కోసం ర‌ష్యా వెళ్తారో లేదో తెలియాల్సి ఉంది.

అభిమానుల‌ను ఖుషీ చేయ‌నున్న చిరు
కొర‌టాల శివ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'ఆచార్య' సినిమాను కూడా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ చిరంజీవితో క‌లిసి న‌టించారు. 'ఆచార్య' ఫ్లాపు త‌ర్వాత, మరో హిట్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. అలాగే తన మాస్ అభిమానుల కోసం చిరంజీవి ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు.

మెహర్ రమేష్‌తో భోళా శంకర్, బాబీతో వాల్తేరు వీరయ్య సినిమాలలో ఆయన మాస్ ప్రేక్షకులను అలరిస్తారని టాక్. వీటితో పాటు వెంకీ కుడుమల, మారుతీ డైరెక్ష‌న్‌లో కూడా మ‌రో సినిమాకు చిరంజీవి (Chiranjeevi) ఓకే చెప్పార‌ట‌. 

Read More: Brahmastra Trailer : బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ రిలీజ్.. ఇందులో చిరంజీవి డైలాగ్స్ వింటే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!