Jailer: హైద‌రాబాద్‌లో జైల‌ర్ షూటింగ్ !.. ర‌జ‌నీకాంత్‌ (Rajinikanth)తో పాటు ఐశ్వ‌ర్య‌రాయ్ కూడా వ‌స్తారా ?

Updated on Aug 10, 2022 05:45 PM IST
ర‌జ‌నీకాంత్ (Rajinikanth) న‌టించిబోయే నెక్ట్స్ మూవీ 'జైల‌ర్' షూటింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
ర‌జ‌నీకాంత్ (Rajinikanth) న‌టించిబోయే నెక్ట్స్ మూవీ 'జైల‌ర్' షూటింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajinikanth) న‌టించే సినిమాల షూటింగ్స్ హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.  తన ప్ర‌తీ సినిమా  షూటింగ్ హైద‌రాబాద్‌లోనే జ‌రిగేలా ర‌జ‌నీ ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నార‌ట‌. ర‌జ‌నీకాంత్ న‌టించిబోయే తదుపరి మూవీ 'జైల‌ర్' షూటింగ్ షెడ్యూల్ కూడా త్వరలోనే భాగ్యనగరంలో ప్రారంభం కానుంది. అయితే ర‌జ‌నీకాంత్‌తో పాటు ఐశ్వ‌ర్య‌రాయ్ కూడా హైద‌రాబాద్‌లో జ‌రిగే షూటింగ్‌కు వచ్చే అవకాశం ఉందా? అనే విషయం మీద క్లారిటీ లేదు. 

హైద‌రాబాద్‌లో త‌లైవా షూటింగ్

తమిళ తలైవా రజనీకాంత్ (Rajinikanth) 169వ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ర‌జ‌నీ 169వ సినిమాకు 'జైల‌ర్' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. 'జైల‌ర్' సినిమా షూటింగ్ కోసం మేక‌ర్స్ హైద‌రాబాద్‌లో భారీ సెట్ కూడా ఏర్పాటు చేశార‌ట‌. ఆగ‌స్టు 15 త‌రువాత‌ 'జైల‌ర్' సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విష‌యాన్ని ర‌జ‌నీకాంత్ స్వ‌యంగా వెల్ల‌డించారు. 

 

ర‌జ‌నీకాంత్ (Rajinikanth) న‌టించిబోయే నెక్ట్స్ మూవీ 'జైల‌ర్' షూటింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

ఆగ‌స్టు 15 నుంచి ఆగ‌స్టు 22 మ‌ధ్య‌లో 'జైల‌ర్' సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ని  సమాచారం. ఈ షూటింగ్ నిమిత్తం త్వరలోనే ర‌జనీకాంత్ హైద‌రాబాద్‌కు రానున్నారు. ఈ ప్రాజెక్టు పూర్త‌య్యేవ‌ర‌కు త‌లైవా హైద‌రాబాద్‌లోనే విడిది చేయనున్నారు. ఇక ర‌జ‌నీకాంత్‌తో పాటు ఐశ్వ‌ర్య‌రాయ్ కూడా హైద‌రాబాద్‌కు రానున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

'జైల‌ర్' సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. అలాగే మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్యరాయ్ బ‌చ్చ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇక ప్రియాంక అరుల్ మోహన్, వసంత రవి, రమ్యకృష్ణ, యోగిబాబు ముఖ్య‌ పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నారు. సన్ పిక్చర్స్ 'జైల‌ర్' సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది. 

Read More: Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ టాప్ 10 చిత్రాలు.. ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిందే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!