కష్టపడి పనిచేస్తున్నా.. అందుకే అవకాశాలు వస్తున్నాయి : కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)

Updated on Jul 18, 2022 10:22 PM IST
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)

కష్టపడి పని చేస్తుండడం వలనే సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని యువ నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) అన్నారు. ప్రస్తుతం నాలుగు కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీగా ఉన్నారు కిరణ్. తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారాయన. జూలై 15న పుట్టినరోజు జరుపుకున్నారు కిరణ్. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పారు.

‘షార్ట్‌ ఫిల్మ్స్‌, ఫీచర్‌ ఫిల్మ్స్‌, నా తదుపరి చిత్రాలు.. జీవితంలోని ప్రతి దశలో అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్త్‌తోనే ఎదుగుతున్నాను. దానికి థ్యాంక్స్‌ మాత్రమే చెబితే సరిపోదు. మిమ్మల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు మరింతగా కష్టపడి పనిచేస్తానని మాట ఇస్తున్నాను. ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి..? బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి..? గట్టి సపోర్ట్‌ ఉందేమో.. ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. వాటన్నింటికీ నా సమాధానం ‘హార్డ్‌ వర్క్‌’. క్లాస్‌లో మనకు తక్కువ మార్కులు వచ్చాయన్న దానికంటే పక్కవాడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయనే బాధ, నెగెటివిటీ ఎక్కువ ఉంటుంది.

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)

ఏదో సాధిస్తున్నాననే..

అలాంటి నెగెటివిటీ నాపై వస్తోంది అంటే జీవితంలో నేనేదో పాజిటివ్‌గా సాధించానని అర్థం. ఈ పని కోసమే ఎన్నో సంవత్సరాలు తిరిగాను. నేను కోరుకున్న పని నాకు వచ్చినప్పుడు దాన్ని ఇష్టపడి చేస్తున్నా’ అని కిరణ్‌ అబ్బవరం తన ట్వీట్‌లో రాశారు.

ఎలాంటి సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కిరణ్‌ అబ్బవరం. మొదటి చిత్రం ‘రాజా వారు రాణి గారు’తో మెప్పించారు. ఆ సినిమా విజయంతో వరుస ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం కిరణ్‌.. కోడి రామకృష్ణ కూతురు దీప్తి నిర్మిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న ‘మీటర్‌’తోపాటు ఏఎం రత్నం  సమర్పణలో తెరకెక్కనున్న ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాల్లో నటిస్తున్నారు.

ఇటీవలే కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే సినిమా రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు కిరణ్ (Kiran Abbavaram) పుట్టినరోజు సందర్భంగా రూల్స్ రంజన్ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఫస్ట్‌ లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Read More : మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi ) థ్యాంక్స్ చెబుతూ బాలీవుడ్‌ స్టార్ అమీర్‌‌ ఖాన్ ట్వీట్.. వైరల్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!