Ram Charan: రామ్ చ‌ర‌ణ్ @ 15 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన చిరంజీవి (Chiranjeevi)

Updated on Sep 28, 2022 04:21 PM IST
 రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) 15 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ‌మైన ట్వీట్ చేశారు.
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) 15 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ‌మైన ట్వీట్ చేశారు.

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ (Ram Charan) సినీ ప్ర‌స్థానం మొద‌లై 15 ఏళ్లు పూర్త‌యింది. రామ్ చ‌ర‌ణ్ 'చిరుత' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. త‌న‌ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు చ‌ర‌ణ్ . రామ్ చ‌ర‌ణ్ 15 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ‌మైన ట్వీట్ చేశారు.

 రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) 15 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ‌మైన ట్వీట్ చేశారు.

త‌న కుమారుడు ఎంతో ఎత్తుకు ఎదిగాడ‌ని ప్ర‌శంసించారు. సినిమాల ప‌ట్ల రామ్ చ‌ర‌ణ్‌కు ఎంతో గౌర‌వం ఉంద‌న్నారు. రామ్ సినిమాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ‌తార‌ని.. అత‌ను మ‌రింత స‌క్సెస్ కావాల‌ని చిరంజీవి కోరుకున్నారు. 

మొద‌టి సినిమాతోనే నంది అవార్డు

రామ్ చ‌ర‌ణ్ 'చిరుత' సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 2007లో 'చిరుత' సినిమా విడుద‌లైంది. ఈ సినిమా స‌క్సెస్ అవ‌డంతో రామ్ చ‌ర‌ణ్ హీరోగా పాపుల‌ర్ అయ్యారు. ఈ సినిమాలో రామ్ న‌ట‌న‌కు నంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డు వ‌రించింది.

 రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) 15 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ‌మైన ట్వీట్ చేశారు.

ఆ త‌రువాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన 'మ‌గ‌ధీర' సినిమాతో రామ్ చ‌ర‌ణ్ టాప్ హీరో స్థాయికి చేరుకున్నారు. ఇక 'రంగ‌స్థ‌లం', 'ఆర్ఆర్ఆర్' సినిమాల‌తో రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా హీరోగా మారారు. 

 రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) 15 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ‌మైన ట్వీట్ చేశారు.

చ‌ర‌ణ్ మ‌రింత ఎద‌గాలి - చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి త‌న కుమారుడు రామ్ చ‌ర‌ణ్  (Ram Charan) సినీ ప్ర‌యాణాన్ని మెచ్చుకుంటూ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ‌తాడ‌ని చిరంజీవి తెలిపారు. బాడీ వ‌ర్క్ అవుట్ విష‌యంలో, స్టైలిష్ లుక్ కోసం రామ్ ప్ర‌త్యేకమైన శ్ర‌ద్ధ తీసుకుంటాడ‌న్నారు.

15 ఏళ్ల సినిమా జీవితంలో రామ్ చ‌ర‌ణ్ 'చిరుత‌', 'మ‌గ‌ధీర‌', 'రంగ‌స్థ‌లం', 'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్ బాస్ట‌ర్ సినిమాల‌లో న‌టించార‌ని గుర్తుచేశారు. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ సినిమాలో న‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. రామ్ చ‌ర‌ణ్‌ను చూస్తే గ‌ర్వంగా ఉంద‌ని.. చ‌ర‌ణ్ మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరాల‌ని కోరుకుంటున్నాన‌ని చిరంజీవి ట్వీట్ చేశారు. 

Read More: 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు ఆస్కార్ ఇవ్వాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!