RRR: 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ (Ram Charan) నటన ఆస్కార్ లెవల్ అంటున్న అభిమానులు !
RRR: టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) "రౌద్రం రణం రుధిరం" సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో రామ్ కనబరిచిన నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. మరోవైపు 'వెరైటీ" అనే మ్యాగజైన్ ఆస్కార్ అవార్డులు ఎవరెవరికి ఇవ్వాలనే పబ్లిక్ టాక్‌తో ప్రెడిక్షన్ లిస్ట్ తయారు చేసింది. ఆ లిస్టులో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పేరు కూడా ఉంది.
ఈ వార్తతో రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రామ్ చరణ్‌కు కచ్చితంగా ఆస్కార్ అవార్డు రావాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. దీంతో #RamCharanForOscars ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటనపై విశ్లేషణతో పాటు, RRR చిత్రం పై స్పెషల్ స్టోరి..
- హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమాను కచ్చితంగా ఆస్కార్ ఆవార్డు వరిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- "ఆర్ఆర్ఆర్" చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan) మన్నెం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడైన అల్లూరి సీతారామరాజును పోలిన పాత్రలో నటించారు.
- అల్లూరి సీతారామరాజు ఎలాగైతే గిరిజన హక్కుల కోసం పోరాడారో.. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో అదే మాదిరిగా తనవాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ వారిని ఎదిరించారు.
- బ్రిటిష్ వారికి మొదట నమ్మకస్తుడుగా ఉన్న రామ్ చరణ్, వారి అంతం కోసం పన్నిన వ్యూహ్యాలను దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు.
- ఇక రామ్ చరణ్ ఆయుధాల కోసం చేసిన సాహసం వెండితెరపై అదరహో అనిపించింది.
- అలాగే బ్రిటిష్ పోలీసు అధికారిగా రామ్ చరణ్ కనబరిచిన నటన హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మరింత అలరించింది. ఇక రామ్ చరణ్ స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా బ్రిటిష్ పోలీస్ యూనిఫాం రామ్ చరణ్‌కు కరెక్ట్‌గా సెట్ అయిందంటూ నెటిజన్లు అంటున్నారు.
- తెలంగాణ గోండుల జాతికి చెందిన కొమురం భీముడితో బ్రిటిష్ వారి కోటలో చేసిన ఫైట్ సీన్లలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ తనకు మరింత ఫాలోయింగ్ పెరిగేలా చేసింది.
- అమాయక ప్రజలను ఆదుకునే క్రమంలో కొమురం భీమ్‌తో కలిసి, బ్రిటిష్ వారిని ఎదిరించే సీన్‌లో రామ్ చరణ్ (Ram Charan) జీవించారనే చెప్పాలి.
- ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరిని పోలిన వేషధారణలో ఎంతగానో ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ సంభాషణలు, బాణాలతో చేసిన దాడులు, ప్రతి దాడులు థియేటర్లను షేక్ చేశాయి.
- "ఆర్ఆర్ఆర్" సినిమాలో రామ్ చరణ్ నటనకు ఆస్కార్ అవార్డు కచ్చితంగా వస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలా అభిప్రాయపడడానికి కారణం, పలువురు హాలీవుడ్ క్రిటిక్స్ కూడా రామ్ నటనను ప్రశంసించడమే.
Read More: హాలీవుడ్‌లో ఉత్తమ చిత్రంగా రాజమౌళి సినిమా .. రెండో స్థానంలో నిలిచిన ఆర్ఆర్ఆర్ (RRR) !