Mega 154 Update: 'మెగా-మాస్' జాతర మొదలైంది.. చిరంజీవితో షూటింగ్ కు రవితేజ రెడీ.. వీడియో వైరల్!

Updated on Jul 16, 2022 08:06 PM IST
'మెగా 154' పోస్టర్ (Mega 154 Poster)
'మెగా 154' పోస్టర్ (Mega 154 Poster)

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. మెగా ఫ్యాన్స్ మెచ్చేలా చిరంజీవిని ఊర‌మాస్ లుక్‌లో ఎలివేట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ బాబీ. సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 

అయితే 'మెగా 154' (Mega154) సినిమా కోసం మెగా మాస్ కాంబో సెట్ చేశారు డైరెక్టర్ బాబీ. కథ రీత్యా మూవీలో ఓ కీలక పాత్ర ఉంటుందట. అది స్టార్ హీరో చేస్తే బాగుంటుందని భావించిన దర్శకుడు బాబీ మాస్ మహారాజ్ రవితేజ (Raviteja)ను ఎంపిక చేశారు. మెగాస్టార్ మూవీ కావడంతో రవితేజ సైతం కాదనకుండా పచ్చ జెండా ఊపారు. చిరంజీవితో కలిసి టాలీవుడ్ రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోనుండటం తెలుగు ప్రేక్షకుల్లో ఆతృతను రెట్టింపు చేసింది. 

ఈ నేపథ్యంలో మెగా స్ట్రోమ్ అంటూ మాస్ మహారాజ్ ఎంట్రీ తాలూకు వీడియో వదులుతూ ఇరువురి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. లేటెస్ట్ షెడ్యూల్‌లో ర‌వితేజ (Ravi Teja) షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన స్పెష‌ల్ వీడియోను క‌ట్ చేసి చిత్ర యూనిట్ మెగా మాస్ కాంబినేష‌న్ అంటూ రిలీజ్ చేసింది. ర‌వితేజ స్టైల్‌గా కారు దిగి న‌డుచుకుంటూ రావ‌టం, చిరంజీవి క్యారీ వ్యాన్‌లోకి వెళ్ల‌టాన్ని వీడియోలో మ‌నం చూడొచ్చు. విడుదల చేసిన క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.

కాగా, చాలా కాలం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్నారు. స్టార్ డమ్ రాక ముందు అన్నయ్య మూవీలో రవితేజ చిరంజీవి తమ్ముడు పాత్ర చేశాడు. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఓ పాటలో కూడా మెరిశాడు రవితేజ. తర్వాత కలిసి నటించడం ఇదే. ఈ మూవీలో చిరంజీవి జంటగా శృతి హాసన్ (Shruthi Haassan) నటిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' (Bhola Shankar) చేస్తున్నారు. కీర్తి సురేష్, తమన్నా నటిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. 

Read More: 'మెగా 154' (Mega 154) షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన మాస్ మహారాజ్ రవితేజ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!