Allu Arjun: గూగుల్‌ సెర్చ్‌ లిస్ట్‌ 2021 టాప్‌లో అల్లు అర్జున్.. హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌కు ఫస్ట్ ప్లేస్‌

Updated on Jun 27, 2022 09:23 PM IST
గూగుల్‌ సెర్చ్‌ టాప్ లిస్ట్‌లో అల్లు అర్జున్‌
గూగుల్‌ సెర్చ్‌ టాప్ లిస్ట్‌లో అల్లు అర్జున్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బన్నీ.. ఆర్య, దేశముదురు, పరుగు, ఆర్య 2, జులాయి వంటి చిత్రాలతో స్టార్‌ హీరోగా ఎదిగారు.  స్టైలిష్‌ స్టార్‌‌గా ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. సరైనోడు, డిజే, అల వైకుంఠపురంలో సినిమాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్న అల్లు అర్జున్.. తాజాగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌ అయ్యాడు.

సినిమా.. సినిమాకు ఇమేజ్‌ను పెంచుకుంటున్న బన్నీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. పోయినేడాది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన సెలబ్రిటీల లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు అత్యధికంగా గూగుల్‌ల్‌లో సెర్చ్‌ చేసిన సౌత్‌ సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. 2021వ సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సెలబ్రిటీల జాబితాను గూగుల్‌ ఇటీవల విడుదల చేసింది.

కాజల్ అగర్వాల్

ఫస్ట్‌ ప్లేస్‌లో ‘కాజల్‌ అగర్వాల్‌’

ఇక హీరోయిన్లలో సౌత్‌ నుంచి కాజల్‌ అగర్వాల్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో సమంతా రుత్‌ ప్రభు, రష్మికా మందాన ఉన్నారు. బాలీవుడ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ టాప్‌లో ఉండగా.. హీరోయిన్లలో కత్రినా కైఫ్‌, అలియా భట్‌, ప్రియాంక చోప్రా వరుస​ స్థానాల్లో నిలిచారు. ఆసియా సెలబ్రిటీల 100 మంది జాబితాలో దివంగత గాయని లతా మంగేష్కర్‌ 5వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప2 సినిమాలో నటిస్తున్నారు.

మహేష్‌బాబు, సూర్య, సమంత, రష్మికా మందాన

కోలీవుడ్‌లో సూర్య టాప్..

నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌ చేసిన సౌత్‌ స్టార్ల లిస్టులో అల్లు అర్జున్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవగా.. ఓవరాల్‌ 100 పేర్లలో 39వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మహేష్‌బాబు నిలిచారు. ఇక, తమిళ స్టార్ హీరో సూర్య కోలీవుడ్‌ నటుల్లో అగ్ర స్థానంలో నిలిచాడు. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా ఇటీవల రిలీజై సూపర్‌‌ డూపర్ హిట్‌ అయిన ‘విక్రమ్‌’ సినిమాలో సూర్య ‘రోలెక్స్‌’ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

Read More : Chiranjeevi: చిరంజీవి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న రావు రమేష్‌.. కాళ్లపై పడిన వెర్సటైల్ యాక్టర్

గూగుల్‌ రిలీజ్ చేసిన లిస్ట్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!