ఆడియెన్స్ అభిరుచి మారింది.. లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలకే ఇప్పుడు ఆదరణ: రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)

Updated on Nov 07, 2022 11:31 AM IST
లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అన్నారు
లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అన్నారు

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పాపులారిటీని రకుల్ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. అయితే ఈ మధ్య ఆమెకు ఆఫర్లు తగ్గాయి. కోలీవుడ్‌లో కమల్ హాసన్ సరసన ‘ఇండియాన్ 2’ చిత్రంలో మాత్రమే రకుల్ నటిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె యాక్ట్ చేసిన ‘థ్యాంక్ గాడ్’ సినిమా ఇటీవలే విడుదలై.. మోస్తరు విజయాన్ని సాధించింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల అభిరుచి మారుతోందని ఆమె అన్నారు. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలను ప్రేక్షకులు  ఆదరిస్తున్న తీరులో వచ్చిన మార్పుల పైనా రకుల్ స్పందించారు. ‘కరోనా తర్వాత సినిమాల్లోని కంటెంట్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. సక్సెస్ సాధించిన చిత్రాల గురించి కూడా చర్చిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితులకు దారితీస్తోంది. అయితే దీని వెనుక చాలా శ్రమ ఉంటోంది. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ప్రేక్షకులు తమ జీవితాలకు మించిన సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. వారికి లార్జర్ దెన్ లైఫ్​ కావాలి’ అని రకుల్ చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్నాయని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు

ఇకపోతే, హిందీలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రకుల్‌కు.. తెలుగులో మాత్రం అంతగా ఆఫర్లు రావడం లేదు. చివరగా ‘కొండపొలం’ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ కనిపించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రంలో నటించే అవకాశం రకుల్‌ను వరించిందని ఆ మధ్య గాసిప్స్ వచ్చాయి. కానీ ఎందుకో ఇది వర్కవుట్ కాలేదు. ‘ప్రస్తుతం మిషన్ సిండ్రెల్ల’, ‘ఆయాలాన్’, ‘ఛత్రివాలి’ సినిమాల్లో నటిస్తూ రకుల్ ఫుల్ బిజీగా ఉన్నారు. మరి, ఈ సినిమాలతో బాలీవుడ్‌లో ఆమె టాప్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతారేమో చూడాలి. 

Read more: 'ఎన్టీఆర్ 30' (NTR30) సినిమాపై రూమర్లు.. వినూత్న రీతిలో సమాధానమిచ్చిన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!