నాకు ఆశ ఎక్కువ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. కష్టపడితేనే అభివృద్ధి సాధించగలమని కామెంట్

Updated on Jul 08, 2022 02:29 PM IST
ఎన్ని సినిమాలు చేశాం అని లెక్కలు వేసుకునే కంటే.. ఎంత మంచి క్యారెక్టర్ చేశామనేది ముఖ్యం అంటున్నారు రకుల్‌ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)
ఎన్ని సినిమాలు చేశాం అని లెక్కలు వేసుకునే కంటే.. ఎంత మంచి క్యారెక్టర్ చేశామనేది ముఖ్యం అంటున్నారు రకుల్‌ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)

తెలుగుతోపాటు హిందీ, కన్నడ బాషల్లో సినిమాలు చేస్తున్నారు హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh). కమర్షియల్‌ పాత్రలే కాకుండా డీ గ్లామర్‌ రోల్స్‌లోనూ అదరగొడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘రన్‌వే 34’ సినిమాలో అజయ్‌ దేవగణ్‌ సరసన నటించిన రకుల్‌.. తనతో నటించిన వారి గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఆ విశేషాలు రకుల్ మాటల్లోనే..

నేను చేసే సినిమాల్లో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే సినిమాలో ఎవరి క్యారెక్టర్‌‌ వాళ్లకే ఉంటుంది. దేని ప్రాధాన్యం దానికే ఉంటుంది. అందుకే సినిమాలో ఎంతమంది నటీనటులు ఉన్నా ఇబ్బందిగా అనిపించదు. అసలు ఆ విషయాన్ని పట్టించుకోను.

కెరటం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)

టైమ్ వేస్ట్‌ చేసుకోను..

'అనవసరమైన విషయాలను బుర్రలోకి ఎక్కించుకుని సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోను. నటిని కావాలని ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చాను. ఆ రోజు నా దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసం మాత్రమే,. అంతకుమించి మరేదీ నా దగ్గర లేదు. అదే నా బలం అనుకుని వచ్చాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతున్నాను.

ముంబై వచ్చినప్పుడు ఎంత స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నానో.. ఇప్పుడు కూడా అంతే స్థాయిలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నా సినిమాలు, క్యారెక్టర్లతో చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు, సాధించిన దానితో సంతృప్తిగా లేను. నాకు ఆశ ఎక్కువ. ఇంకా మంచి సినిమాలు చేయాలి. మంచి క్యారెక్టర్లు చేయాలని ఆశపడుతున్నాను'

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)

కష్టపడితేనే మంచి అవకాశాలు..

'మంచి అవకాశాలు రావాలంటే మరింతగా కష్టపడాలి. ఆ ఆలోచనలు మనలో ఎప్పుడూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందుతాం. అవకాశాల కోసం, ఎదుగుదల కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను. ఎన్ని సినిమాలు చేశాం అని లెక్కలు వేసుకునే కంటే కూడా.. ఎంత మంచి క్యారెక్టర్ చేశామనేది చాలా ముఖ్యం' అని రకుల్‌ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) చెప్పుకొచ్చింది.

Read More : ర‌కుల్ ప్రీత్ సింగ్‌ అస్సలు తగ్గడం లేదుగా.. అందాల విందు చేస్తున్న బ్యూటీ!

  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!