'ఇండియన్ 2' (Indian 2) షూటింగ్ సెట్ లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. ఇన్ స్టాగ్రామ్ స్టోరీ వైరల్!

Updated on Sep 04, 2022 02:12 PM IST
తాజాగా 'ఇండియన్‌–2' (Indian 2) మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).
తాజాగా 'ఇండియన్‌–2' (Indian 2) మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించిన పేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇలా అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. రకుల్ ప్రీత్ సింగ్ చివరగా వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన 'కొండపొలం' సినిమాలో కనిపించింది. 

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ మధ్య బాలీవుడ్‌పై (Bollywood) తెగ ఫోకస్ పెట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 'ఎటాక్', 'రన్ వే 34', 'కల్ పుట్లీ' లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇక, ఈ అమ్మడికి ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవనే చెప్పాలి. ఈ క్రమంలోనే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే రకుల్ ప్రీత్ సౌత్ మీద కూడా ఓ కన్నేసే ఉంచింది.   

ఈ నేపథ్యంలో ఇండియన్‌–2 చిత్రంతో రకుల్ కు మళ్లీ దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కలిగింది. శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ అగర్వాల్ (Kajal Aggarwal), రకుల్‌ ప్రీత్ సింగ్ లు ఇందులో కథానాయికలుగా ఎంపికయ్యారు. హీరో సిద్ధార్థ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా.. పీటర్ హెయిన్స్ స్టంట్లు రూపొందిస్తున్నారు.

కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ (Kamal Haasan, Rakul Preet Singh Instagram Story)

తాజాగా 'ఇండియన్‌–2' మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ విషయాన్ని స్వయంగా తెలియజేస్తూ "ఇండియన్ 2 బిగిన్స్" (Indian 2 Begins) అంటూ తన ఇన్ స్టా స్టోరీ లో పేర్కొంది. ఈ సినిమాతో సౌత్‌లో మళ్లీ పాగా వేయాలని రకుల్ భావిస్తోంది.  

అయితే, నిజానికి 'ఇండియన్ 2' (Indian 2) చిత్రం ఎప్పుడో ప్రారంభం కాగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇక, ఈ ఏడాది కమల్ తను నటించిన 'విక్రమ్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రాన్ని తిరిగి త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అనుకున్నట్లే ఇటీవలే 'ఇండియన్ 2' పునఃప్రారంభమైంది. 

Read More: Rakul Preeth Singh: ర‌కుల్ ప్రీత్ సింగ్‌ అస్సలు తగ్గడం లేదుగా.. అందాల విందు చేస్తున్న బ్యూటీ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!