Rakul Preeth Singh: ర‌కుల్ ప్రీత్ సింగ్‌ అస్సలు తగ్గడం లేదుగా.. అందాల విందు చేస్తున్న బ్యూటీ!

Published on Jun 22, 2022 12:33 PM IST

Rakul Preeth Singh: ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం ఈ బ్యూటీ అక్కడ ఏమాత్రం తగ్గడం లేదు. నాన్ స్టాప్ ఫోటో షూట్స్ తో సౌందర్య ఆరాధకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కోట్, ప్యాంటు ధరించి వంగి వంగి పరువాల విందు చేసింది. లోదుస్తులు కూడా లేకుండా ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది. బోల్డ్ అండ్ స్టైలిష్ గా ఉన్న రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కాగా, ఈ బ్యూటీ సౌత్ లో స్టార్ హీరోయిన్ కావ‌డానికి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం నానా తంటాలు ప‌డుతోంది. అక్క‌డ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర కావ‌డానికి లేనిపోని పాట్లు అన్నీ ప‌డుతోంది. కాగా, ఆమె కెరీర్ తెలుగులోనే మొద‌లైంది. టాలీవుడ్‌కు (Tollywood) ఆమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఎంట్రీ ఇవ్వగా.. ఆ సినిమా హిట్ అయింది. ఇంకేముంది వ‌రుస‌గా యావ‌రేజ్ హీరోల‌తో జ‌త‌క‌ట్టింది. ఆ తర్వాత లౌక్యం, స‌రైనోడు, నాన్న‌కు ప్రేమ‌తో, ధృవ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఆమె ఖాతాలో ప‌డ్డాయి. దెబ్బ‌కు సౌత్ లోనే స్టార్ హీరోయిన్‌రేసుకు వెళ్లిపోయింది. దాంతో ఆమెకు త‌మిళం నుంచి కూడా వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

కాగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రం రన్ వే 34(Runway 34) ఏప్రిల్ 29న విడుదలయ్యింది. ప్రొఫెషనల్ గా సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వెళుతున్న రకుల్ పర్సనల్ లైఫ్ లోకూడా కంఫర్ట్ గా ఉన్నారు. కొద్దినెలల క్రితం యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తన ప్రేమికుడు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్  చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించిన కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ ప్రైజ్ అనే చెప్పాలి.

Read More: ప్రియుడితో బంధాన్ని దాచాలని అనుకోవడం లేదంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ (Rakul Preeth Singh)