'రంగ రంగ వైభవంగా' వ‌స్తున్న‌ వైష్ణవ్ తేజ్(Vaisshnav Tej)!.. మామ‌య్య ప‌వ‌న్ బ‌ర్త్ డేకు అల్లుడి స‌ర్‌ప్రైజ్

Updated on Jul 14, 2022 11:50 AM IST
వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) 'రంగ రంగ వైభ‌వంగా' సినిమాను సెప్టెంబ‌ర్ 2 న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.
వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) 'రంగ రంగ వైభ‌వంగా' సినిమాను సెప్టెంబ‌ర్ 2 న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

టాలీవుడ్‌లో మొద‌టి సినిమాతోనే స‌క్సెస్ అందుకున్నారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). 'ఉప్పెన' సినిమా త‌ర్వాత వ‌చ్చిన 'కొండ‌పొలం'లో వైష్ణ‌వ్ తేజ్ న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో 'రంగ రంగ వైభ‌వంగా' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

వైష్ణ‌వ్ తేజ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే
వైష్ణ‌వ్ తేజ్ (Vaisshnav Tej) న‌టించిన 'రంగ రంగ వైభ‌వంగా' సినిమాను సెప్టెంబ‌ర్ 2 న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

త‌న మామ‌య్య ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు  సంద‌ర్భంగా వైష్ణ‌వ్ తేజ్ కొత్త సినిమాను సెప్టెంబ‌ర్ 2 న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాను బి. బాపినీడు సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర పతాకంపై నిర్మాత‌ బీవీఎస్‌ఎన్ ప్రసాద్ రంగ రంగ వైభ‌వంగా చిత్రాన్ని నిర్మించారు.

ల‌వ్ స్టోరిలో వైష్ణ‌వ్ తేజ్(Vaisshnav Tej)
యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా 'రంగ రంగ వైభ‌వంగా' చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాను జూలై 1న విడుదల చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల‌తో సినిమా రిలీజ్ వాయిదా ప‌డింది. ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పాటలు మంచి ఆదరణ పొందాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ సినిమా ఓటీటీ హక్కులను (Aha )ఆహా స్ట్రీమింగ్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది.  'రంగ రంగ వైభ‌వంగా'  సినిమా థియేటర్‌లో విడుదలైన ఐదు వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో వైష్టవ్ తేజ్  హ్యాట్రిక్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

త‌న సినిమా 'రంగ రంగ వైభ‌వంగా' సినిమా రిలీజ్‌పై వైష్ణ‌వ్ తేజ్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌ర్ పుల్‌గా రిలీజ్ కానుందంటూ ట్వీట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజున త‌న సినిమా విడుద‌ల కానుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు వైష్ణ‌వ్ తేజ్. 

Read More: మెగా హీరోలు సాయిధరమ్, వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) వైపు.. 'కందిరీగ' డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ చూపు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!