మెగా హీరోలు సాయిధరమ్, వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) వైపు.. 'కందిరీగ' డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ చూపు!

Updated on Jul 01, 2022 09:17 PM IST
సాయిధరమ్ తేజ్, సంతోష్ శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ (Saidharam Tej, Santosh Srinivas, Vaishna Tej)
సాయిధరమ్ తేజ్, సంతోష్ శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ (Saidharam Tej, Santosh Srinivas, Vaishna Tej)

Santosh Srinivas: టాలీవుడ్ లో సినిమాటోగ్రాఫర్ గా చేస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. యంగ్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన "కందిరీగ" సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను కూడా తీసుకువచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ పేరు టాలీవుడ్ లో బాగానే మారు మోగింది.  ఆ తర్వాత  ఆ సినిమాకి రామ్ తోనే సీక్వెల్ తీయాలని కొన్నేళ్ళు తెగ ప్రయత్నించాడు. అది వర్కవుట్ కాకపోవడంతో యన్టీఆర్ (NTR) తో ‘రభస’ చిత్రం తెరకెక్కించాడు. 

భారీ యాక్షన్ ఎంటర్ టైనర్  'రభస' తెరకెక్కించి దారుణమైన ఫలితాన్ని అందించారు. దీంతో  సంతోష్ పనైపోయిందని విమర్శలు తెరపైకి వచ్చాయి.  కానీ రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రామ్ తో 'హైపర్' (Hyper Movie) తెరకెక్కించారు. అదీ తేడా కొట్టింది. అటుపై ఐదేళ్ల గ్యాప్ తీసుకుని యంగ్ స్టార్ సాయి శ్రీనివాస్ తో 'అల్లుడు అదుర్స్' అంటూ వచ్చారు.  ఆ సినిమా ఫలితం గురించి కూడా తెలిసిందే. అప్పటి నుంచి సంతోష్ శ్రీనివాస్ కదలికలు టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సారి సంతోష్ శ్రీనివాస్ మెగా మేనల్లుడు తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) లకు కథను నరేట్ చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరు ఓకే అంటే సినిమా వాళ్లతో తీద్దామని సంతోష్ శ్రీనివాస్ ప్లాన్. అయితే ప్రస్తుతం వరుస డిజాస్టర్ తో సాయి తేజ్ ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జోనర్లో సినిమా తీసి హిట్ అందుకోవాలని తపన పడుతున్నారు. మరోవైపు వైష్ణవ్ తేజ్ కూడా కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తగా ఉండే కథలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సాయిధరమ్ (Saidharam Tej).. సంతోష్ శ్రీనివాస్ లాంటి ఫ్లాప్ దర్శకుడ్ని దగ్గరకు రానిస్తాడా అన్నది ప్రశ్న. అలాగే.. వైష్ణవ్ తేజ్ సైతం రెండో సినిమా ఫ్లాప్ అవడంతో.. ఇక నుంచి కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు.  కొత్తతరహా దర్శకుల్ని, విభిన్నతరహా కథల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్ని లైన్ లో పెడుతున్నాడు. ఆ కారణంగా వైష్ణవ్ కూడా సంతోష్ శ్రీనివాస్ తో ఇప్పట్లో సినిమా చేయడం కష్టం. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా సంతోష్ శ్రీనివాస్ కి ఓకే చెప్తారో లేదో చూడాలి.

Read More: Sai Dharam Tej: సాయిధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా 'భీమ్లా నాయక్' బ్యూటీ సంయుక్తా మీనన్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!