Tees maar Khan: దుమ్ము రేపుతున్న హీరో ఆది 'తీస్‌మార్ ఖాన్' టీజర్.. పాయల్ రాజ్‌పుత్‌‌తో రొమాన్స్ అదుర్స్!

Updated on Jun 18, 2022 06:14 PM IST
'తీస్ మార్ ఖాన్' మూవీ పోస్టర్స్ (Tees maar Khan Movie Posters)
'తీస్ మార్ ఖాన్' మూవీ పోస్టర్స్ (Tees maar Khan Movie Posters)

హిట్లు, ఫ్లాపుల‌లో సంబంధంలేకుండా వ‌రుస‌గా సినిమాల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటాడు ఆది సాయికుమార్‌ (Aadi sai kumar). ఈ హీరో  దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కిన 'తీస్ మార్ ఖాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కళ్యాణ్‌జీ గతంలో 'నాటకం' పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కించారు.

ప్రస్తుతం 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ఆదికి జోడీగా పాయల్ రాజ్‌పుత్ నటించడం విశేషం. కరోనా  కారణంగా చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. జులై 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. 

ఇప్పటికే తీస్ మార్ ఖాన్ (Tees maar Khan) మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను నిర్మాతలు విడుదల చేయగా.. అవన్నీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  దీంతో తాజాగా మూవీ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసేలా ఉంది.

ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది మరోసారి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్‌గా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. కాగా, ఈ సినిమాలో ఆది.. స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీ,క్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

ఒక నిమిషం 34 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ (Tees maar Khan Teaser) లోని సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. 'తీస్ మార్ ఖాన్' అంటూ సాగే ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపిస్తూ, సినిమాపై హైప్ పెంచేశారు.

‘ఆఫీస్‌కు వెళ్ళే మా అన్న తిరిగి రాలేడు’ అనే డైలాగ్‌తో ఈ సినిమా టీజ‌ర్ మొద‌లవుతుంది. 'మనం ఆపాలనుకున్నంత పవర్ మనదగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది' అనే డైలాగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేస్తోంది. ‘రాక్ష‌సుడికి ర‌క్ష‌కుడు అంటే ఏంటో చూపించండి’ అనే డైలాగ్‌తో హీరో ఎంట్రీ అద్భుతంగా ఉంది. 

ఇక హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో (Payal Rajput) రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కామెడీ టచ్ ఇస్తూ యాక్షన్ సీన్స్ చూపించిన విధానం సినిమాలో హైలైట్ అవుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని విజ‌య్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తిరెడ్డి నిర్మించారు.

ఈ సినిమాలో సునీల్‌, పూర్ణ‌, క‌బీర్ దుహ‌న్ సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. టాలీవుడ్‌లో ‘ప్రేమ‌కావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది, అన‌తికాలంలోనే మంచి న‌టుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న క్రేజ్ ఎలా ఉన్నా, సినిమాల‌ను మాత్రం వ‌రుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న ఆరు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. 

Read More: Hebah Patel: గ్లామర్ ఫోటోలతో హీటెక్కిస్తున్న 'కుమారి 21ఎఫ్' భామ హెబ్బా పటేల్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!