Regina Cassandra: రెడ్ డ్రెస్ లో రెజీనా హాట్ పరువాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

Published on Jun 17, 2022 03:59 PM IST

Regina Cassandra: రెజీనా.. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు టాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేసింది. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. రెజీనా చివరగా తెలుగులో సూపర్ హిట్ మూవీ ఎవరులో నటించింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటోంది. 

ఈ నేపథ్యంలో ఇటీవ‌లే ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' (Acharya Movie) చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కొంత‌కాలంగా స‌రైన బ్రేక్‌ లేని రెజీనాకు ఇలా రూటు మార్చి స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించినా..పెద్ద‌గా ఫలితం లేకుండా పోయింది. ఆచార్య లో ‘సానా క‌ష్టం’ అంటూ చిరంజీవితో రొమాంటిక్ స్టెప్పులేసింది రెజీనా. 

తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తూ.. హిందీ ఓటీటీ సిరీస్ రాకెట్రీ బాయ్స్ లో కూడా న‌టించింది. చిరంజీవి (Megastar Chiranjeevi)తో పాట త‌న‌కు ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని ఆశ‌లు కూడా పెట్టుకుంది. ప్రస్తుతం తెలుగు నాట ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాస్ సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ ఆచార్య సినిమాలోని ఓ ఐటెం పాట సందడి చేస్తోంది.

ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రెజీనా కసాండ్రా సైతం, ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయింది. ఇక ఈ పాటలో అయితే రెజీనా ఎంపిక వెనుక చాలా పెద్ద కసరత్తే జరిగింది. ముందుగా ఈ పాటలో తమన్నాను ఎంపిక చేద్దాం అనుకున్నారు. కానీ డైరక్టర్ కొరటాల మాత్రం రెజీనాను సంప్రదించారు. దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని రెజీనా నిలబెట్టుకుంది. అందుకు తగ్గట్టే ఆడి పాడి అలరించింది.

తెలుగులో కొంత‌కాలంగా స‌రైన బ్రేక్ లేని ఈ భామ‌కు మెగాస్టార్ చిరంజీవి సినిమా క‌లిసొస్తుంద‌ని పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాశ‌లు అయ్యాయి. సినిమా ఫ్లాప్ కావ‌డంతో రెజీనా పేరు వినిపించ‌కుండా పోయింది. టాలీవుడ్ (Tollywood) లో శివ మనసులో శృతి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించింది.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెట్టింది రెజీనా. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో మైమ‌ర‌చిపోయే అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. రెజీనా అందాల‌ని చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

Read More: Godse Movie: 'గాడ్సే' మూవీ ప్రమోషన్లలో సందడి చేసిన హీరో సత్యదేవ్.